ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు స్టాగ్‌ఫ్లేషన్‌ ముప్పు

ABN, First Publish Date - 2022-01-17T08:54:10+05:30

భారత్‌కు స్టాగ్‌ఫ్లేషన్‌ ముప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బడ్జెట్‌ కత్తి మీద సామే.. ఆర్థికవేత్త కౌశిక్‌ బసు

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితి గతులపై ప్రపంచ బ్యాంక్‌ మాజీ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్‌ బసు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ‘స్టాగ్‌ఫ్లేషన్‌’ ప్రమాదానికి చేరువ లో ఉందన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండి, ఆర్థిక వ్యవస్థలో ఎదుగూ బొదుగూ లేనా స్థితిని  ‘స్టాగ్‌ఫ్లేషన్‌’ అంటారు. కొవిడ్‌ కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నా, అది కొద్ది రంగాలకు మాత్రమే పరిమితం అయిందని బసు అన్నారు. సగం ఆర్థిక వ్యవస్థ ఇంకా మాంద్యంలోనే ఉందన్నారు. కొవిడ్‌కు ముందే యువతలో 23 శాతం మందికి చేసేందుకు పని లేదని చెప్పారు. ప్రపంచంలో మరే దేశ యువతలోనూ నిరుద్యోగ రేటు ఈ స్థాయిలో లేద న్నారు. డిసెంబరు నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్ఠ స్థాయి 5.59 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో బసు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. 


బడ్జెట్‌ సవాలే

 స్టాగ్‌ఫ్లేషన్‌ నేపథ్యంలో బడ్జెట్‌ రూపకల్పన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కత్తి మీద సాముగా  మారనుందన్నారు. యూపీఏ హయాంలోనూ ద్రవ్యో ల్బణం 10 శాతం దాటిపా, జీడీపీ వృద్ధి రేటు తొమ్మిది శాతానికి పైగా ఉండడం కలిసొచ్చిందని ఆయన చెప్పారు. అయితే కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతున్న విష యాన్ని గుర్తు చేశారు. గత రెండేళ్ల జీడీపీ సగటు వృద్ధిరేటు 0.5 శాతానికి పడిపోయిన విషయం కూడా ప్రస్తావించారు. ఇలాంటి సమయంలో 200 కోట్ల డాలర్లు (సుమారు రూ.15,000 కోట్లు) ఖర్చు చేసి సెంట్రల్‌ విస్టా వంటి ప్రాజెక్టులు చేపట్టే బదులు, పేద, మధ్యతరగతి ప్రజలు నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు ఉపయోగపడే ఉత్పాదక ప్రాజెక్టులు చేపట్టడం మంచిదన్నారు. 


‘ఫెడ్‌’ ప్రభావం ఉండదు 

 అమెరికా కేంద్ర  బ్యాంక్‌ ‘ఫెడ్‌ రిజర్వు’ వడ్డీ రేట్ల పెంపు, రుణ పత్రాల బైబ్యాక్‌ తగ్గింపు ప్రభావం ఈ సారి భారత్‌పై పెద్దగా ఉండదన్నారు. 64,000 కోట్ల డాలర్లకు పైగా ఉన్న విదేశీ మారక నిల్వలు ఈ విషయంలో భారత్‌కు శ్రీరామ రక్షలా పని  చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 


క్రిప్టోలపై మన వైఖరి సరైందే 

క్రిప్టో కరెన్సీలపై ప్రభుత్వ వైఖరిని బసు సమ ర్ధించారు. ఈ కరెన్సీలు మరింత విస్తృతమవుతాయ న్నారు. కేంద్ర బ్యాంకులు కూడా భవిష్యత్‌లో బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ బాట పట్టక తప్పదన్నారు. పేపర్‌ కరెన్సీకి కాలం తీరే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బలంగా నమ్ముతున్నట్టు ఆయన తెలిపారు. 


Updated Date - 2022-01-17T08:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising