ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Economic Crisis: శానిటరీ ప్యాడ్స్‌పై పన్ను మినహాయింపు

ABN, First Publish Date - 2022-10-03T17:27:39+05:30

ఆర్థిక సంక్షోభంలో(Economic Crisis) కూరుకుపోయిన శ్రీలంక(Sri Lanka) మహిళలకు తాజాగా శుభవార్త వెల్లడించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలోంబో(శ్రీలంక): ఆర్థిక సంక్షోభంలో(Economic Crisis) కూరుకుపోయిన శ్రీలంక(Sri Lanka) మహిళలకు తాజాగా శుభవార్త వెల్లడించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా శ్రీలంక సర్కారు దేశంలోని మహిళలు వినియోగించే శానిటరీ ప్యాడ్లపై(Sanitary Napkins) పన్ను రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించింది. మహిళల వ్యక్తిగత శుభ్రత కోసం వారు వినియోగించే శానిటరీ ప్యాడ్లపై పన్ను మినహాయించి (cut taxes) తక్కువ ధరలకు అందించాలని శ్రీలంక సర్కారు నిర్ణయించింది. శానిటరీ నాప్ కీన్ల ఉత్పత్తికి ఉపయోగించే రా మెటిరీయల్స్ పై పన్నును మినహాయిస్తూ ఆ దేశ సర్కారు నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి శ్రీలంక దేశంలోకి దిగుమతి చేసుకునే శానిటరీ ప్యాడ్లపై కూడా పన్నును మినహాయించాలని నిర్ణయించారు.


10 శానిటరీ ప్యాడ్ల ప్యాక్ ఉత్పత్తికి రూ.50 నుంచి రూ.60ఖర్చు అవుతుండగా దీన్ని 260 నుంచి 270 రూపాయల గరిష్ఠ ధరకు విక్రయిస్తున్నారు.ఆర్థిక సంక్షోభంలో దేశం ఉన్నా పన్ను మినహాయించి మహిళలకు తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్లను అందించాలని శ్రీలంక సర్కారు నిర్ణయించింది. 

Updated Date - 2022-10-03T17:27:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising