ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fixed Deposit Rates: అధిక వడ్డీ ఆశించేవారికి ఈ బ్యాంకులు పర్‌ఫెక్ట్.. మీకు అకౌంట్ ఉందో లేదో మరీ?

ABN, First Publish Date - 2022-09-07T20:54:22+05:30

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారు సహజంగానే మెరుగైన వడ్డీ రేటుని ఆశిస్తారు. కానీ కొన్ని బ్యాంకుల పరిమితికి మించి వడ్డీని అందించలేవు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఫిక్స్‌డ్ డిపాజిట్(Fixed Deposit) చేసే బ్యాంక్ ఖాతాదారులు సహజంగానే మెరుగైన వడ్డీ రేటుని(Interest rate) ఆశిస్తారు. కానీ కొన్ని బ్యాంకుల పరిమితికి మించి వడ్డీని అందించలేవు. అయినప్పటికీ మార్కెట్లో చక్కటి వడ్డీ రేట్లను ఆఫర్ చేేసే ప్రత్యమ్నాయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి. 3 ఏళ్ల కాలపరిమితి వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.5 శాతం మేర వడ్డీని చెల్లిస్తూ  ఆకర్షిస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులే అయినప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆర్బీఐ(RBI) రెపో రేటు(Repo rate) పెంచడంతో 6 నెలల నుంచి 3 ఏళ్ల స్వల్పకాలిక ఎఫ్‌డీలపై(FD) ఇటివలే రేట్లను పెంచాయి. ఆ బ్యాంకులేవో, వడ్డీని ఎంత శాతం అందిస్తున్నాయో బ్యాంక్‌బజార్(BankBazaar) డేటాపై ఓ లుక్కేద్దాం..


- ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Fincare Small Finance Bank), ఉజ్జయిన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు(Ujjivan Small Finance Bank)లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.5 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తున్నాయి. అధిక వడ్డీ రేటు అందిస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈ రెండూ టాప్‌లో దూసుకెళ్తున్నాయి. రూ.1 లక్ష డిపాజిట్‌ నుంచి ఈ రేటును వర్తింపజేస్తున్నాయి. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఈ ఎఫ్‌డీ కాలపరిమితి 1000 రోజులు కాగా.. ఉజ్జయిన్ బ్యాంకులో 525, 990 రోజులుగా ఉంది.

- సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Suryoday Small Finance Bank) రూ.1 లక్ష మొత్తాన్ని 999 రోజుల కాలపరిమితికి ఎఫ్‌డీ చేస్తే 7.49 శాతం వడ్డీ అందిస్తోంది. 

- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Jana Small Finance Bank) రూ.1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.35 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అయితే ఎఫ్‌డీ కాలపరిమితి కనిష్ఠంగా 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల మధ్య ఉండాలి.

- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Equitas Small Finance Bank) 888 రోజుల కాలపరిమితితో రూ.1 లక్ష ఎఫ్‌డీపై 7.32 శాం వడ్డీ ఆఫర్ చేస్తోంది. 

- చక్కటి వడ్డీ రేట్లు అందిస్తున్న విదేశీ బ్యాంకుల్లో డ్యూయిస్ బ్యాంక్(Deutsche Bank) ఒకటి. రూ.1 లక్ష ఎఫ్‌డీపై ఈ బ్యాంకు 7 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే ఇన్వెస్ట్‌మెంట్ టెన్యూర్ 3 - 4 ఏళ్ల మధ్య ఉండాలి.

- ప్రైవేటు బ్యాంకుల్లో బంధన్ బ్యాంక్(bandhan bank), ఆర్‌బీఎల్ బ్యాంక్(RBL) ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. రూ.1 లక్ష ఎఫ్‌డీపై ఈ రెండు బ్యాంకులూ 7 శాతం వడ్డీని ఆఱ్ చేస్తున్నాయి. కాలపరిమితి కనిష్ఠంగా 1 ఏడాది నుంచి 5 ఏళ్ల కాలపరిమితిపై ఈ వడ్డీని అందిస్తోంది.

- ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్(IDFC First Bank) రూ.1 లక్ష ఎఫ్‌డీపై 6.9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ టెన్యూర్ 750 రోజులుగా ఉంది. 


కాగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, చిన్న ప్రైవేటు బ్యాంకులు కొత్త డిపాజిట్ల కోసం అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 2, 2022 వరకు అమలులో ఉన్న వడ్డీ రేట్లు ఇవి. కాగా ఆర్బీఐ అనుబంధ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై గ్యారంటీని అందిస్తోన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-09-07T20:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising