ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5-7 నెలల్లో ‘5జీ’కి బీఎ్‌సఎన్‌ఎల్‌ అప్‌గ్రేడ్‌

ABN, First Publish Date - 2022-12-09T01:24:18+05:30

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎ్‌సఎన్‌ఎల్‌ 4జీ టెక్నాలజీని ఐదు నుంచి ఏడు నెలల్లో 5జీ కి అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు కేంద్ర టెలికాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎ్‌సఎన్‌ఎల్‌ 4జీ టెక్నాలజీని ఐదు నుంచి ఏడు నెలల్లో 5జీ కి అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు కేంద్ర టెలికాం, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. గురువారం నాడిక్కడ సీఐఐ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఎ్‌సఎన్‌ఎల్‌ దేశవ్యాప్తంగా 1.35 లక్షల టవర్లను నిర్వహిస్తూ బలమైన టెలికాం కంపెనీగా ఉందన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఏ టెలికాం ఆపరేటర్‌కు లేనటువంటి పటిష్ఠమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు. టెక్నాలజీపరంగా బీఎ్‌సఎన్‌ఎల్‌ ఎంతో బలంగా ఉందని, సంస్థకు చెందిన 4జీ టెక్నాలజీని ఏడు నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా సంస్థకు చెందిన 1.35 లక్షల టవర్లలో ఈ కొత్త తరం టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైష్ణవ్‌ తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే దేశీయ టెలికాం రంగంలో బీఎ్‌సఎన్‌ఎల్‌ మూడో అతిపెద్ద సంస్థగా అవతరిస్తుందన్నారు.

Updated Date - 2022-12-09T01:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising