ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కరోజే రూ.3800 పెరిగిన వెండి

ABN, First Publish Date - 2022-10-05T09:32:18+05:30

పండగ వేళ దేశంలో విలువైన లోహాల ధర లు కొండెక్కాయి. ఢిల్లీ మార్కెట్లో మేలిమి బంగారం (24 క్యారెట్లు) తులానికి రూ.980 పెరిగి రూ.51,718కి చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బంగారానిదీ అదే జోరు

ఢిల్లీలో తులం బంగారం రూ.980 వృద్ధి  


న్యూఢిల్లీ: పండగ వేళ దేశంలో విలువైన లోహాల ధర లు కొండెక్కాయి. ఢిల్లీ మార్కెట్లో మేలిమి బంగారం (24 క్యారెట్లు) తులానికి రూ.980 పెరిగి రూ.51,718కి చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.3,790 మేర ఎగబాకి రూ.61,997 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు ఒక్కసారిగా పెరగడమే ఇందుకు కారణమని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్నేషనల్‌ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ మళ్లీ 1,700 డాలర్ల ఎగువ స్థాయికి చేరుకోగా.. సిల్వర్‌ 20 డాలర్లు దాటింది. అమెరికన్‌ డాలర్‌ విలువతోపాటు ఆ దేశ బాండ్ల రిటర్నుల రేటు తగ్గడం అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్‌ మళ్లీ పెరిగింది. మంగళవారం ఒకదశలో బంగారం 1,722 డాలర్ల స్థాయికి పెరగగా.. వెండి 21 డాలర్ల ఎగువన ట్రేడైంది. ఈ లెక్కన బుధవారం దేశీయంగా బంగారం, వెండి రేటు మరింత పెరిగే అవకాశాలున్నాయి. 


Updated Date - 2022-10-05T09:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising