ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Philips O-Bulb: ప్రత్యేక ఆకారంలో ఉన్న బల్బులను ఆవిష్కరించిన సిగ్నిఫై.. ఎంత అందంగా ఉన్నాయో!

ABN, First Publish Date - 2022-12-15T20:54:34+05:30

రెండు వినూత్న ఆకారాల్లో ఉండే బల్బులను సిగ్నిఫై భారత్‌లో లాంచ్ చేసింది. లైటింగ్‌లో ప్రపంచ

Hexa Bulb
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రెండు వినూత్న ఆకారాల్లో ఉండే బల్బులను సిగ్నిఫై భారత్‌లో లాంచ్ చేసింది. లైటింగ్‌లో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన సిగ్నిఫై (Signify) తాజాగా ఫిలిప్స్ షట్కోణ బల్బ్ (Hexa-Bulb), వృత్తాకార బల్బ్‌ (O-Bulb) ఆవిష్కరించింది. ఇండోర్ స్పేస్‌కు అద్భతమైన అందాన్ని తీసుకొచ్చేందుకు ఇవి తోడ్పడతాయి. ప్రశాంతంగా గడిపే సమయాల్లో పరిపూర్ణ వాతావరణాన్ని సృష్టించేందుకు వీటిని అలంకరణ లైట్లుగానూ ఉపయోగించుకోవచ్చు.

ఇవి రెండూ సాధారణ ప్లగ్ అండ్ ప్లే రూపాన్ని కలిగి ఉండడంతో ఇప్పటికే ఉన్న బల్బ్ సాకెట్లలో వీటిని సులభంగా అమర్చుకోవచ్చు. సాధారణ ఎల్‌ఈడీ బల్బులతో పోలిస్తే ఇవి మరింత కాంతిని అందిస్తాయి. కొత్త డిజైన్ బల్బులను ఆవిష్కరించిన అనంతరం సిగ్నిఫై (దక్షిణాసియా) సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ జోషి మాట్లాడుతూ.. సిగ్నిఫై ఆవిష్కరణల్లో ఎప్పుడూ అగ్రగామిగానే ఉంటుందన్నారు. వినూత్న ఆకృతితో కూడిన బల్బులతో తమ సరికొత్త శ్రేణిని ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇవి కళ్లపై ఎలాంటి ప్రభావం చూపవని అన్నారు. వీటి సొగసైన డిజైన్ కారణంగా ఇంటీరియర్ మరింతగా వన్నెలీనుతుందని పేర్కొన్నారు.

ఫిలిప్స్ హెక్సా బల్బ్ 16W, 1500 ల్యూమన్ వేరియంట్‌లో అందుబాటులో ఉండగా, ఫిలిప్స్ వృత్తాకార బల్బ్ 20W, 1800 ల్యూమెన్స్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ధరలు వరుసగా రూ. 999, రూ. 1199 మాత్రమే.

Updated Date - 2022-12-15T20:57:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising