ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Citibank scamలో దోషి శివరాజ్ పూరి క్షయ వ్యాధితో మృతి

ABN, First Publish Date - 2022-05-21T13:46:07+05:30

సిటీ బ్యాంక్ కుంభకోణంలో దోషిగా తేలిన శివరాజ్ పూరి జైలులో క్షయవ్యాధితో మృతి చెందాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సిటీ బ్యాంక్ కుంభకోణంలో దోషిగా తేలిన శివరాజ్ పూరి జైలులో క్షయవ్యాధితో మృతి చెందాడు.46 ఏళ్ల పూరి టీబీ వ్యాధితో బాధపడుతూ మరణించారని జైలు అధికారులు చెప్పారు.2010లో రూ.400 కోట్ల సిటీ బ్యాంక్‌ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి శివరాజ్‌ పూరి.ఇతను భోండ్సీ జైలులో శిక్ష అనుభవిస్తూ ఢిల్లీలోని ఆస్పత్రిలో టీబీకి చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు.ఖేర్కి దౌలా పోలీస్ స్టేషన్‌లో నమోదైన మోసం కేసులో పూరీ నవంబర్ 2020 నుంచి జైలులో ఉన్నాడు.భూ మోసం కేసులో పూరీని గురుగ్రామ్ పోలీసులు నవంబర్ 2020లో డెహ్రాడూన్ నుంచి అరెస్టు చేశారు.400 కోట్ల సిటీ బ్యాంక్ కుంభకోణం కేసులో పూరీని 2010లో తొలిసారిగా అరెస్ట్ చేశారు. 


సిటీ బ్యాంక్‌లో రిలేషన్ షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్న శివరాజ్ వివిధ ఖాతాదారుల నుంచి రూ.400 కోట్ల నగదును కల్పిత ఖాతాలకు మళ్లించి స్వాహా చేసినట్లు అధికారులు తెలిపారు.ఇతను 2018లో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి చాలా మందిని మోసం చేశాడు. పూరిని 2018లో ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించి 2020లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-05-21T13:46:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising