ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేతివృత్తుదారులు, రైతులకు... ఏడు లక్షల షేర్లు...

ABN, First Publish Date - 2022-01-24T02:03:21+05:30

రైతులు, కళాకారులకు ఏడు లక్షల షేర్లను బహుమతిగా ప్రకటించిన కంపెనీ లైఫ్‌స్టైల్ రిటైల్ బ్రాండ్ ఫ్యాబ్ఇండియా... ఐపీఓ ద్వారా రూ. 4 వేల కోట్ల మేర సమీకరించే యత్నాల్లో ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : రైతులు, కళాకారులకు ఏడు లక్షల షేర్లను బహుమతిగా ప్రకటించిన కంపెనీ లైఫ్‌స్టైల్ రిటైల్ బ్రాండ్ ఫ్యాబ్ఇండియా... ఐపీఓ ద్వారా రూ. 4 వేల కోట్ల మేర సమీకరించే యత్నాల్లో ఉంది. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు చేతివృత్తుదారులు, రైతులకు ఏడు లక్షల షఫేర్లను బహుమతిగా ఇవ్వాలని యోచిస్తోంది. రూ. 500 కోట్ల విలువైన షేర్ల తాజా ఇష్యూను కలిగి ఉన్న ఆఫర్ కోసం కంపెనీ నిన్న(శనివారం) మార్కెట్‌ల పర్యవేక్షణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా... 2,50,50,543 షేర్లను ‘ఆఫర్ ఫర్ సేల్’ కింద ప్రకటించింది. 

ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) విలువ దాదాపు రూ. 4 వేల కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కంపెనీ అనుబంధ సంస్థలతో అనుబంధం ఉన్న కొంతమంది కళాకారులు, రైతులకు రివార్డ్ రూపంలో వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఫ్యాబ్‌ఇండియా ఇద్దరు ప్రమోటర్లు  బిమ్లా నందా బిస్సెల్, మధుకర్ ఖేరా... నాలుగు లక్షల షేర్లను కేటాయించడంతోపాటు, మరో 3.75 లక్షల షేర్లను బదిలీ చేయాలని భావిస్తున్నారు. 

Updated Date - 2022-01-24T02:03:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising