ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుల్ దూకుడు.. భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ 934 పాయింట్లు వృద్ధి..

ABN, First Publish Date - 2022-06-21T21:39:22+05:30

గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండవ సెషన్ మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అన్ని రంగాల షేర్ల మెరవడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల ప్రభావంతో  దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Eqity markets) వరుసగా రెండవ సెషన్ మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అన్ని రంగాల షేర్లు రాణించడంతో బీఎస్‌‌ఈ సెన్సెక్స్(Sensex) 934 పాయింట్లు లేదా 1.81 శాతం మేర భారీగా వృద్ధి చెంది 52,532.07 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(Nifty) 288.65 పాయింట్లు లేదా 1.88 శాతం మేర లాభపడి 15,638.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. 


ఇటివల భారీ విక్రయాలతో వెల్లువెత్తిన తర్వాత ఆసియా మార్కెట్లు, వాల్‌స్ట్రీట్ ఫ్యూచర్స్ మంగళవారం తిరిగి కళకళ్లాడాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం, సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు భారీగా పెంచనున్నాయని ఆందోళనలు ఉన్నప్పటికీ మార్కెట్లు దూసుకెళ్లాయి. ప్రధాన సూచీలతోపాటు అన్ని రంగాల సూచీలూ మెరిశాయి. పీఎస్‌బీ, మెటల్, ఎనర్జీ(ఆయిల్ అండ్ గ్యాస్) సూచీలు అత్యధికంగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ 


ప్రత్యేకంగా స్టాకుల విషయానికి వస్తే.. టైటాన్ కంపెనీ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోలిండియా, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, టీసీఎస్, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు 2.8 శాతం నుంచి 6 శాతం మధ్య లాభాలతో ముగిశాయి. అయితే నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్ షేర్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.

Updated Date - 2022-06-21T21:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising