ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Samsung సంచలన నిర్ణయం...రష్యాలో ఫోన్లు, చిప్‌‌ల అమ్మకాల నిలిపివేత

ABN, First Publish Date - 2022-03-05T17:05:14+05:30

యుద్ధం అనంతరం పలు దేశాలు, అంతర్జాతీయ కంపెనీలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: యుద్ధం అనంతరం పలు దేశాలు, అంతర్జాతీయ కంపెనీలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్ దేశంపై సైనిక దాడి అనంతరం రష్యాలో పలు అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశాయి.ఇప్పటికే ఆపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు రష్యాలో తమ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసినట్లు ప్రకటించాయి. తాజాగా శాంసంగ్ కంపెనీ ఫోన్లు, చిప్ ల రవాణాను నిలిపివేసింది.రష్యా మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉంది. ఉక్రెయిన్ దేశంపై యుద్ధం నేపథ్యంలో రష్యాలో తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసినట్లు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో శనివారం ప్రకటించింది.దక్షిణ కొరియా టెక్ దిగ్గజమైన శాంసంగ్ తమ కంపెనీ చిప్‌ల నుంచి స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేసినట్లు తెలిపింది. 


శామ్సంగ్ రష్యాలోని కలుగాలో టీవీ ప్రొడక్షన్ ప్లాంట్‌ కూడా ఉంది.రష్యాలో శాంసంగ్ ప్రధాన స్మార్ట్‌ఫోన్ విక్రయదారుగా ఉంది. మార్కెట్ వాటా 30శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంది. యుద్ధం కారణంగా శాంసంగ్ తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయడం సంచలనం రేపింది.

Updated Date - 2022-03-05T17:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising