ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఓ ఇన్వెస్టర్లకు అమ్మకాల పోటు!

ABN, First Publish Date - 2022-01-27T07:30:12+05:30

గత ఏడాది రికార్డు సంఖ్యలో కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. వాటిలో చాలా కంపెనీల ఇష్యూలతోపాటు స్టాక్‌ మార్కెట్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత ఏడాది నమోదైన కంపెనీల్లో  ప్రతి మూడింటిలో ఒకటి లిస్టింగ్‌ ధర దిగువకు


ముంబై: గత ఏడాది రికార్డు సంఖ్యలో కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. వాటిలో చాలా కంపెనీల ఇష్యూలతోపాటు స్టాక్‌ మార్కెట్లో వాటి షేర్ల లిస్టింగ్‌కూ ఇన్వెస్టర్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈక్విటీ మార్కెట్ల జోరు, రిటైల్‌ మదుపరుల ఆసక్తి పెరగడం ఇందుకు దోహదపడింది. అయితే, ఈ ఏడాది మార్కెట్లు బేర్‌ మలుపు తీసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల్లో అమ్మకాలు పోటెత్తడంతో గడిచిన కొన్ని వారాల్లో మన మార్కెట్లూ భారీగా పతనమవుతూ వచ్చాయి. దాంతో, 2021లో నమోదైన ప్రతి మూడింటిలో ఒక కంపెనీ షేరు లిస్టింగ్‌ ధర కంటే దిగువన ట్రేడవుతోంది. పేటీఎం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌, నైకా పోర్టల్‌ నిర్వహణదారు ఎఫ్‌ఎ్‌సఎన్‌ ఈ-కామర్స్‌ వెంచర్స్‌, జొమాటో, పాలసీబజార్‌ పోర్టల్‌ నిర్వహణ కంపెనీ పీబీ ఫిన్‌టెక్‌, కార్‌ట్రేడ్‌ వంటి ఆధునిక టెక్నాలజీ కంపెనీలతోపాటు స్టార్‌ హెల్త్‌ షేర్లైతే, లిస్టింగ్‌ ధరతో పోలిస్తే భారీగా క్షీణించాయి. దాంతో ఆ ఆరు కంపెనీల మార్కెట్‌ విలువ సోమవారం నాటికి రూ.1.2 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. గత సంవత్సరం లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువలో రూ.2 లక్షల కోట్లు ఆవిరయింది. బ్లూంబర్గ్‌ డేటా ప్రకారం.. బీఎ్‌సఈ ఐపీఓ ఇండెక్స్‌ ఈ ఏడాదిలోనే 10 శాతం వరకు క్షీణించింది. పబ్లిక్‌ ఆఫరింగ్‌ అనంతరం మార్కెట్లో లిస్టయ్యాక రెండేళ్ల వరకు కంపెనీ షేర్ల పనితీరును గమనించేందుకు ఈ సూచీని ఏర్పాటు చేశారు. గత ఏడాది 63 కంపెనీలు ఐపీఓల ద్వారా మొత్తం రూ.1.2 లక్షల కోట్లు సమీకరించాయి. పబ్లిక్‌ ఇష్యూల ద్వారా ఏడాదికాలంలో సేకరించిన నిధుల్లో ఇదే అతిపెద్ద మొత్తం.  

Updated Date - 2022-01-27T07:30:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising