ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కే-హబ్‌లో రూరల్‌ ఆంత్రప్రెన్యూర్‌ సెంటర్‌

ABN, First Publish Date - 2022-12-15T01:34:07+05:30

గ్రామీణ ప్రాంతాల్లో ఆంత్రప్రెన్యూర్లను తయారు చేస్తున్న కాకతీయ శాండ్‌బాక్స్‌ (కేఎ్‌స)కు చెందిన కే-హబ్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.20 కోట్లు అందించనున్న కన్వాల్‌ రేఖీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్రామీణ ప్రాంతాల్లో ఆంత్రప్రెన్యూర్లను తయారు చేస్తున్న కాకతీయ శాండ్‌బాక్స్‌ (కేఎ్‌స)కు చెందిన కే-హబ్‌లో కన్వాల్‌ రేఖీ రూరల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ స్టార్టప్‌ కేంద్రాన్ని (క్రెస్ట్‌)ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిలికాన్‌ వ్యాలీ ఆంత్రప్రెన్యూర్‌ కన్వాల్‌ రేఖీ రూ.20 కోట్లు అందిస్తున్నారు. క్రెస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు టై గ్లోబల్‌ సదస్సులో ప్రకటించారు. భారత్‌లో గ్రామీణ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహించడానికి ఈ కేంద్రం కృషి చేస్తుంది.

కాకతీయ శాండ్‌ బాక్స్‌ గత తొమ్మిదేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వ్యవసాయం, నైపుణ్యాలు, స్టార్ట్‌పలను ఏర్పాటు చేయడం వంటి వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కాకతీయ శాండ్‌బాక్స్‌ తయారు చేస్తోంది. దాదాపు లక్ష మందికి శిక్షణ ఇచ్చింది. కే-హబ్‌ నిజామాబాద్‌లో ఉంది. దీన్ని రాజు రెడ్డి, ఫణీంద్ర సామ ప్రమోట్‌ చేశారు. క్రెస్ట్‌ ద్వారా ముందుగా ఉత్తర తెలంగాణాలో ఆంత్రప్రెన్యూర్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తామని.. తర్వాత దీన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని రాజు రెడ్డి తెలిపారు. క్రెస్ట్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మెంటారింగ్‌, నెట్‌వర్కింగ్‌ వంటి సదుపాయాలను కల్పిస్తుంది. కేఎస్‌ ఇప్పటి వరకూ 300కు పైగా స్టార్ట్‌పలకు మద్దతు ఇచ్చింది.

Updated Date - 2022-12-15T01:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising