ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rupee slides : మరింత దిగజారిన రూపాయి.. మంగళవారం ఏ స్థాయికి క్షీణించిందో తెలుసా..

ABN, First Publish Date - 2022-07-05T23:08:04+05:30

దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతన బాటలోనే కొనసాగుతోంది. మంగళవారం ఏకంగా 41 పైసలు మేర క్షీణించి డాలర్‌పై మారకంలో సరికొత్త జీవితకాల కనిష్ఠస్థాయి 79.36 కి పడిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి(Rupee) విలువ పతన బాటలో కొనసాగుతోంది. మంగళవారం ఏకంగా 41 పైసలు మేర క్షీణించి డాలర్‌పై(Dollar) మారకంలో జీవితకాల కనిష్ఠస్థాయి(Lifetime Low) 79.36 కి పడిపోయింది. డాలర్ విలువ మరింత బలపడడం, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రవాహం కొనసాగుతుండడం రూపాయి క్షీణతకు కారణాలయ్యాయి. దీంతో దేశ కరెంట్ ఖాతా లోటు మరింత పెరిగే అవకాశముందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 


మంగళవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌(Interbank Forex Market)లో రూపాయి వ్యాల్యూ 79.04 వద్ద ట్రేడింగ్ ఆరంభమైంది. ఇంట్రాడే గరిష్ఠం 79.02, కనిష్ఠం 79.38గా ఉండగా.. 79.36 వద్ద స్థిరపడింది. మొత్తంగా మంగళవారం 41 పైసలు మేర రూపాయి నష్టపోయింది. కాగా సోమవారం సెషన్‌లో డాలర్‌పై మారకంలో 78.95 వద్ద రూపాయి ముగిసిన విషయం తెలిసిందే. డాలర్ విలువ మరింత దృఢమవ్వడం, దేశీయ మార్కెట్ల గణాంకాలు అంచనాల కంటే తక్కువగా ఉండడం రూపాయి బలహీనతకు కారణమని షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి అన్నారు. జూన్ నెల ఎగుమతుల్లో వృద్ధి నమోదవ్వడం, గ్లోబల్ మార్కెట్ల బలహీన సెంటిమెంట్, క్రూడాయిల్ ధరలు మండిపోతున్న నేపథ్యంలో రూపాయి విలువ మరింత పతనమయ్యే అవకాశముందని ఆయన విశ్లేషించారు.


82 స్థాయి వరకు పతనం  : నోమురా అంచనా

రూపాయి విలువ పతనబాటలో కొనసాగుతుండడంతో ఆర్థిక సంవత్సరం 2023లో దేశ కరెంట్ ఖాతా లోటు(current account deficit) 3.3 శాతానికి దిగజారే అవకాశముందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ నోమురా( Nomura ) అంచనా వేసింది. గతేడాది కరెంట్ ఖాతా లోటు 1.2 శాతంగా ఉందని రిపోర్టులో ప్రస్తావించింది. ప్రస్తుత 2022 మూడవ త్రైమాసికం నాటికి 82 స్థాయికి రూపీ దిగజారవచ్చునని నోమురా లెక్కగట్టింది. ద్రవ్యోల్బణం కట్టడికి యూఎస్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింత పెంచబోతోందనే అంచనాలున్నాయి. దీంతో వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు పెద్ద మొత్తంలో ఉపసంహరణ జరిగే అవకాశముండడంతో రూపాయి భారీగా పతనమవ్వొచ్చని నోమురా ఎనలిస్టులు విశ్లేషించారు.

Updated Date - 2022-07-05T23:08:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising