ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూపాయి మళ్లీ పడింది...

ABN, First Publish Date - 2022-08-04T08:03:24+05:30

ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో భారీ పతనం చవి చూసింది. దేశీయ కరెన్సీ పుంజుకుందన్న ఆశలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో భారీ పతనం చవి చూసింది. దేశీయ కరెన్సీ పుంజుకుందన్న ఆశలు ఒక్క రోజైనా నిలవలేదు. బుధవారం ఉదయం రూ.78.70 వద్ద ప్రారంభమైన రూపాయి చివరికి 62 పైసల నష్టంతో రూ.79.15 వద్ద ముగిసింది. స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశ పరచడం ఇందుకు ప్రధాన కారణం. ఎఫ్‌పీఐల పెట్టుబడులు, చమురు సెగ తగ్గుముఖం పట్టకపోతే రూపాయి మరింత క్షీణించేదని మార్కెట్‌ వర్గాల అంచనా. అమెరికా-చైనా తాజా ఉద్రిక్తతలు కూడా బుధవారం రూపాయి మారకం రేటుని దెబ్బతీశాయి.


ఈక్విటీల్లో అదే జోరు: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఆరో రోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 214.17 పాయింట్ల లాభంతో 58,350.53 వద్ద, 42.70 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17,388.15 వద్ద ముగిశాయి. దీంతో బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ గత ఆరు రోజుల్లో రూ.13.53 లక్షల కోట్లు పెరిగి రూ.271.08 లక్షల కోట్లకు చేరింది. బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు, ట్రేడింగ్‌ చివర్లో ఒక్కసారిగా లాభాల బాట పట్టాయి. ఐటీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు ప్రధాన కారణం. ఎఫ్‌పీఐల పునఃప్రవేశం, కొన్ని ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండడమూ ఇందుకు దోహదం చేసింది. డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం లేకపోతే సూచీలు మరింత పరిగెత్తేవని మార్కెట్‌ వర్గాలు చెప్పాయి. చమురు సెగ తగ్గుముఖం పట్టడం కూడా  మార్కెట్‌కు కలిసొచ్చింది. 

Updated Date - 2022-08-04T08:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising