ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17800 వద్ద నిరోధం

ABN, First Publish Date - 2022-04-04T07:19:41+05:30

నిఫ్టీ గత వారం స్వల్ప రియాక్షన్‌తో ప్రారంభమై ఆ తర్వాత రికవరీ సాధించి నిలకడగా సాగుతూ చివరకు 517 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయి 17670 వద్ద క్లోజైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిఫ్టీ గత వారం స్వల్ప రియాక్షన్‌తో ప్రారంభమై ఆ తర్వాత రికవరీ సాధించి నిలకడగా సాగుతూ చివరకు 517 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయి 17670 వద్ద క్లోజైంది. టెక్నికల్‌గా చూస్తే గడచిన మూడు వారాలుగా మార్కెట్‌ రికవరీ ట్రెండ్‌లో సాగుతూ వస్తోంది. మంత్లీ చార్టుల ప్రకారం చూసినా బలమైన రికవరీతో పాజిటివ్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. అయితే ఇటీవలి గరిష్ఠ స్థాయిల వద్ద నిఫ్టీ మరోసారి పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉండటంతో స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ స్వల్పకాలిక నిరోధ స్థాయిలైన 17800కు చేరువలో ఉంది. కొద్ది రోజులు ఇక్కడ నిలదొక్కుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుందా లేదా అనేది తేలుతుంది. 

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ పాజిటివ్‌ ధోరణి కనబ రిచినట్టయితే 17800 ఎగువన నిరోధ స్థాయిలుం టాయి. ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఏర్పడిన స్థాయి. స్వల్పకాలిక దిశను తీసుకునే ముందు నిఫ్టీ ఇక్కడ కన్సాలిడేషన్‌ను చవిచూసే అవకాశం ఉంది. ఇక్కడ నిలదొక్కుకుంటే అప్‌ట్రెండ్‌లోకి అడుగుపెట్టే వీలుంది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయిలు 18100, 18350.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ బలహీనత కనబరిస్తే 17400 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. ఇది గత గురు, శుక్రవారాల్లో ఏర్పడిన కనిష్ఠ స్థాయి. రక్షణ కోసం ఈ స్థాయిలకు ఎగువన కచ్చితంగా రికవరీ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి స్వల్పకాలిక మద్దతు స్థాయి 17000 దిగువన ఉంటుంది. 

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 36000 పాయింట్లను అధిగమించి చివరకు 37000 పాయింట్ల ఎగువన క్లోజైంది. అంతకుముందు వారం క్లోజింగ్‌తో పోల్చితే దాదాపు 1700 పాయింట్లు లాభపడింది. అప్‌ట్రెండ్‌ను కనబరిస్తే 37600-38000 ఎగువన నిరోధ స్థాయిలుంటాయి. ఒకవేళ బలహీనతను సూచిస్తే 36800 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది. 

పాటర్న్‌: నిఫ్టీ ప్రస్తుతం 17800 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద మైనర్‌ నిరోధం ఎదుర్కొంటోంది. సానుకూలత కోసం ఇక్కడ బ్రేకౌట్‌ సాధించాలి. అలాగే 100, 200 డిఎంఏలను అధిగమించటంతో పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌కు అవకాశం ఉంది.  అలాగే 17400 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద దిగువకు చేరితే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. 

టైమ్‌: వీక్లీ చార్టుల ప్రకారం సోమ, గురువారాల్లో మైనర్‌ రివర్సల్‌కు అవకాశం ఉంది.


   సోమవారం స్థాయిలు

నిరోధం : 17730, 17800

మద్దతు : 17580, 17500   

Updated Date - 2022-04-04T07:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising