ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త పుంతలు తొక్కనున్న ‘రియాలిటీ’...

ABN, First Publish Date - 2022-01-20T22:24:36+05:30

ఈ సంవత్సరం(2022 లో)... రియాల్టీ ధరలు 30 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని రియాల్టీ డెవలపర్స్ అంచనా వేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ఈ సంవత్సరం(2022 లో)... రియాల్టీ ధరలు 30 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని రియాల్టీ డెవలపర్స్ అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ మెటీరియల్ ధరలు పెరిగిన నేపధ్యంలో ఈ ధరలు కూడా పెరగవచ్చుని ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఆర్‌ఈడీఏఐ)’ పేర్కొంది.  ‘రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సెంటిమెంట్ సర్వే 2022’ పేరుతో ఇందుకు సంబంధించిన నివేదిక విడుదలైంది, ఈ సర్వేలో 1322 మంది డెవలపర్స్ పాల్గొన్నారు.


ధరలు పెరుగుతాయని ఈ సందర్భంగా ఎక్కువమంది డెవలపర్స్ తెలిపారు. సర్వేలో పాల్గొన్న దాదాపు 60 శాతం మంది డెవలపర్లు 2022 లో ధరలు 20 శాతం వరకు పెరగవచ్చని తెలిపారు. బిల్డింగ్ మెటిరీయల్ ధరలు పెరిగిన కారణంగా ఈ పెంపు ఉండవచ్చునని చెప్పారు. ఇక... 35 శాతం మంది డెవలపర్లు... ధరలు 10-20 శాతం మేర పెరగవచ్చునని, 25 శాతం మంది బిల్డర్లు 10 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. మరో 21 శాతం మంది 20-30 శాతం మేర పెరగవచ్చునని వెల్లడించారు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ఆందోళన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కరోనా నేపధ్యంలో ఆయా రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించవచ్చునని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెండెట్ హర్ష్ వర్ధన్ పటోడియా పేర్కొన్నారు. ఇక పలువురు డెవలపర్లు... డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ పై దృష్టి సారించారని, ఆన్‌లైన్ అమ్మకాలను పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. దాదాపు 39 శాతం మంది డెవలపర్లు తమ వ్యాపారంలో 25 శాతాన్ని ఆన్‌లైన్ ద్వారా కొనసాగిస్తున్నారని తెలిపారు.


ఈ ఏడాది కొత్తగా... 

2022 లో 74 శాతం మంది డెవలపర్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 55 శాతం మంది డెవలపర్లు వర్చువల్ రియాల్టీని అనుసరిస్తున్నారు. అలాగే 39 శాతం మంది డెవలపర్లకు చెందిన 25 శాతం వ్యాపారం ఆన్‌లైన్ ద్వారా నడుస్తోంది. ఇక... 65 శాతం మంది డెవలపర్లు 2022 లో కొత్త మోడల్ వ్యాపారానికి సిద్ధమవుతున్నారు. కో-వర్కింగ్, కో-లివింగ్ వంటి వాటికి మొగ్గు చూపుతున్నారు. ఇక త్వరలో తెరమీదకు రానున్న కేంద్ర బడ్జెట్ కూడా రియాల్టీ రంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది. 

Updated Date - 2022-01-20T22:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising