ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది వడ్డీ రేట్లు మరింత పెంపు !.. సిద్ధంగా RBI ?

ABN, First Publish Date - 2022-06-03T01:24:43+05:30

కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ(RBI) కీలక వడ్డీ రేట్లను మరింత పెంచబోతోందా? గృహ, వాహన, ఇతర రుణాలపై ఈఎంఐల భారం పెరగనుందా ? అంటే ఔననే అంటున్నారు ఆర్థిక నిపుణులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ(RBI) కీలక వడ్డీ రేట్ల(Interest rates)ను ఈ ఏడాది మరింత పెంచబోతోందా? గృహ, వాహన, ఇతర రుణాలపై ఈఎంఐల(EMI) భారం పెరగనుందా ? అంటే ఔననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియలో భాగంగా రానున్న నెలల్లో కూడా రెపో రేటు పెంపు ఖాయమంటున్నారు. తదుపరి జరగనున్న 4 ద్రవ్యవిధాన సమీక్ష(Monetary Policy Committee) భేటీల్లో గరిష్ఠంగా 100 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. కాగా తదుపరి ద్రవ్యసమీక్ష భేటీ జూన్ 8న జరగబోతోంది. అయితే ఏ స్థాయిలో పెంచుతారనేది మాత్రం చెప్పలేమని, 25-75 బేసిస్ పాయింట్ల మధ్య పెంచొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇటివల ఓ ప్రముఖ వార్త సంస్థ నిర్వహించిన పోల్‌లో ఆర్థికవేత్తలు ఈ మేరకు విశ్లేషించారు. వచ్చే ఏడాది తొలినాళ్లకల్లా వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశముందంటున్నారు. 


కాగా మే 4న ఆర్బీఐ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది. రెపో రేటును ఏకంగా 40 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ మోనిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం కట్టడి దృష్ట్యా వడ్డీ రేట్లు మరింత పెంపు ఉంటుందని ఆర్బీఐ అప్పుడే సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇదివరకే సంకేతాలిచ్చారని ఆర్థిక నిపుణులు ప్రస్తావించారు. 


ఈఎంఐలు, ఎఫ్‌డీల పరిస్థితి ఏమిటి?

ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. అందుకు అనుగుణంగా బ్యాంకులు కూడా గృహ, వాహన, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయి. దీంతో రుణగ్రహీతలపై ఈఎంఐల(ఈక్వెటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్) భారం పెరగొచ్చు. అయితే ఈ నిర్ణయం ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై సానుకూల ప్రభావం చూపనుంది. ఎఫ్‌డీలపై బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్లు అందించనున్నాయి. కాగా ఇటివల ఆర్బీఐ విడుదల చేసిన ఓ రిపోర్టులో కూడా వడ్డీ రేట్ల పెంపు సంకేతాలిచ్చింది. ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరుగుతున్న  నేపథ్యంలో ఆర్థిక వృద్ధి కొనసాగాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొంది. అయితే వడ్డీ రేట్లు పెంచితే బ్యాంకుల రుణాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-06-03T01:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising