PURE EV: వచ్చేసింది సరికొత్త కమ్యూట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘ఎకోడ్రిఫ్ట్’
ABN, First Publish Date - 2022-12-16T21:44:35+05:30
భాగ్యనగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విద్యుత్ ద్విచక్ర వాహన సంస్థ ప్యూర్ ఈవీ (PURE EV) తమ మొట్టమొదటి కమ్యూట్
హైదరాబాద్: భాగ్యనగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విద్యుత్ ద్విచక్ర వాహన సంస్థ ప్యూర్ ఈవీ (PURE EV) తమ మొట్టమొదటి కమ్యూట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఎకోడ్రిఫ్ట్‌ను విడుదల చేసింది. దీనిని దేశీయంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కూడా భారతీయ కమ్యూట్ విభాగపు అవసరాలను తీర్చడం లేదు.
ప్యూర్ ఈవీ గతేడాది తమ ప్రీమియం మోటర్ సైకిల్ ఈట్రిస్ట్ 350 (ETryst 350)ను విడుదల చేసింది. ప్రీమియం మార్కెట్ కోసం ప్రత్యేకంగా దీనిని డిజైన్ చేశారు. ఈ ఆవిష్కరణతో ప్యూర్ ఈవీ ఇప్పుడు ఒకే ఒక్క ఈవీ2డబ్ల్యూ కంపెనీగా స్కూటర్లతో పాటుగా మోటార్ సైకిల్స్‌ను సైతం అందిస్తూ ప్రీమియం, కమ్యూటర్ విభాగాలను లక్ష్యంగా చేసుకుంది.
దేశ వ్యాప్తంగా తమ ఔట్‌లెట్ల వద్ద టెస్ట్ డ్రైవ్‌ల కోసం డెమో వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఎకోడ్రిఫ్ట్‌ను అందుబాటు ధరలో కమ్యూట్ మోటార్ సైకిల్ విభాగంలో విడుదల చేయనున్నారు. వీటి ధరలను జనవరి మొదటి వారంలో వెల్లడిస్తారు. ఈ వాహనాలు నాలుగు రంగులు.. బ్లాక్, గ్రే, బ్లూ, రెడ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) మోటర్‌బైక్‌లకు సమానంగా సవారీ అనుభవాలను అందిస్తుంది. ఒక్కసారి బ్యాటరీ పూర్తిగా చార్జ్ చేస్తే 135 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ వాహనంలో 3.0 కిలోవాట్ హవర్ పేటెంటెడ్, ఏఐఎస్ సర్టిఫైడ్ బ్యాటరీని ఉపయోగించారు. దీనిని ప్యూర్ ఈవీ అభివృద్ధి చేసింది.
ఈ సందర్భంగా ప్యూర్ ఈవీ ఫౌండర్, ఐఐటీ హైదరాబాద్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిశాంత్ దొంగరి మాట్లాడుతూ.. ఈ కమ్యూట్ మోటర్‌సైకిల్ ఆవిష్కరణ ఓ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని అన్నారు. వినియోగదారులు ఈవీల దిశగా మారేందుకు ఈ వాహనం ఎంతగానో తోడ్పతుందని అన్నారు. కో ఫౌండర్, సీఈవో రోహిత్ వదేరా మాట్లాడుతూ.. తమ పెర్ఫార్మెన్స్ మోటర్‌సైకిల్ ఈట్రైస్ట్ 350కి అపూర్వ స్పందన లభించినట్టు చెప్పారు. అదిచ్చిన ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్లి బ్రాండ్ బిల్డింగ్‌పై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాలలో ప్యూర్ ఈవీ తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే తమ ఉత్పత్తులను దక్షిణాసియాకు ఎగుమతి చేయడంతో పాటుగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా మార్కెట్‌లకు సైతం విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Updated Date - 2022-12-16T21:44:36+05:30 IST