రెండో రోజూ లాభాల్లోనే
ABN, First Publish Date - 2022-12-15T01:17:46+05:30
టోకు ధరల ద్రవ్యోల్బణం దిగివచ్చిందన్న వార్తలు గురువారం స్టాక్ మార్కెట్‌కు ఉత్తేజం అందించాయి...
ముంబై: టోకు ధరల ద్రవ్యోల్బణం దిగివచ్చిందన్న వార్తలు గురువారం స్టాక్ మార్కెట్‌కు ఉత్తేజం అందించాయి. వరుసగా రెండో రోజున కూడా సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ 144.61 పాయింట్ల లాభంతో 62,677.91 వద్ద ముగియగా నిఫ్టీ 52.30 పాయింట్ల లాభంతో 18,660.30 వద్ద ముగిసింది. ఐఆర్‌సీటీసీ సంస్థ తన ఈక్విటీలో ఐదు శాతం (4కోట్లు) షేర్లను గురు, శుక్రవారాల్లో ఓఎఫ్‌ఎస్ ద్వారా విక్రయించనుంది. ఇందుకోసం ఒక్కో షేరు ధరను రూ.680గా నిర్ణయించారు.
Updated Date - 2022-12-15T01:17:49+05:30 IST