ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

84 ఔషధాల ధరలు ఖరారు

ABN, First Publish Date - 2022-07-04T10:24:57+05:30

ధరల నియంత్రణ జాబితాలో ఉన్న 84 ఔషఽ దాల రిటైల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం సవరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాబితాలో బీపీ, షుగర్‌ ఔషధాలు : ఎన్‌పీపీఏ 

న్యూఢిల్లీ: ధరల నియంత్రణ జాబితాలో ఉన్న 84 ఔషఽ దాల రిటైల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇందు లో బీపీ, షుగర్‌, గ్యాస్టోఇంటెస్టినల్‌ సమస్యలకు వాడే మందు లు కూడా ఉన్నాయి. టైప్‌-2 మధుమేహ ఉపశమనం కోసం వాడే ఒక్కో వొగ్లిబోస్‌, మెటాఫార్మిన్‌ హైడ్రోక్లోరైడ్‌ టాబ్లెట్ల ధరలను రూ.10.47గా ఖరారు చేసింది. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఎన్‌పీపీఐ.. ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పారాసిటమాల్‌, కెఫిన్‌ టాబ్లెట్ల ధరలనూ ఒక్కోటి రూ.2.88గా ఖరారు చేశారు. జ్వరాల నుంచి ఉపశమనం, నరాల ఉత్తేజం కోసం ఈ టాబ్లెట్స్‌ ఉపయోగిస్తారు. హృదయ సంబంధ సమస్యలకు వినియోగించే రాస్‌వాస్టాటిన్‌ యాస్ర్పిన్‌, ప్లేట్‌లెట్లు, బ్లడ్‌కాట్స్‌ ఉపశమనం కోసం వాడే క్లొపిడోగ్రెల్‌ ఒక్కో క్యాప్సూల్‌ ధరను రూ.13.91గా నిర్ణయించింది. ఈ ధరలకు జీఎసీటీ అదనం. శరీరంలో కొలెస్ట్రాల్‌ నియంత్రణకు వాడే ఆట్రోవాస్టాటిన్‌, ఫినోఫైబ్రేట్‌ టాబ్లెట్ల ధరనూ ఒక్కోటి రూ.13.87గా ఖరారు చేశారు. హృద్రోగులు, బీపీ పేషెంట్లు ఉపయోగించే ఒల్మెసార్టాన్‌, మెడోక్సోమిల్‌, ఆమ్లోడిపైన్‌ టాబ్లెట్ల ధరనూ ఒక్కోటి రూ.12.91గా ఎన్‌పీపీఏ నిర్ణయించింది. 


సెప్టెంబరు వరకు ఆక్సిజన్‌కు గరిష్ఠ ధర  

లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ ఇన్‌హలేషన్‌ (మెడిసినల్‌ గ్యాస్‌) రిటైల్‌ ధరలపైనా ఎన్‌పీపీఏ కీలక నిర్ణయం తీసుకుంది. వీటిపై గతంలో విధించిన గరిష్ఠ ధరల పరిమితి ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకు కొనసాగుతుందని తెలిపింది. నియంత్రిత జాబితాలోని ఔషధాల ధరలను ఫార్మా కంపెనీలు అడ్డగోలుగా పెంచకుండా కళ్లేం వేసేందుకు ఎన్‌పీపీఏ వాటి ధరల్ని ఎప్పటికప్పుడు సవరిస్తుంటుంది.

Updated Date - 2022-07-04T10:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising