ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోలు, డీజిల్‌పై ఎగుమతి సుంకం పెంపు

ABN, First Publish Date - 2022-07-03T21:43:11+05:30

పెట్రోల్, డీజిల్, Air Turbine Fuel(ATF)పై ఎగుమతి సుంకg పెరిగింది. దేశీయ డిమాండ్‌ను తీర్చడంలో ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్, Air Turbine Fuel(ATF)పై  ఎగుమతి సుంకం పెరిగింది. దేశీయ డిమాండ్‌ను తీర్చడంలో ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది. పెట్రోల్‌పై ఎగుమతి సుంకం లీటర్‌కు రూ. 6, డీజిల్‌పై రూ. 13, ఏటీఎఫ్‌పై మాత్రం రూ. 6(డీజిల్ కన్నా తక్కువగా) చొప్పున పెరిగింది. ఎగుమతిదారులు పెట్రోల్‌లో 50 %, డీజిల్‌లో 30 % దేశీయ మార్కెట్‌లోవిక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది.


అంతేకాకుండా... అధిక అంతర్జాతీయ చమురు ధరల నుండి ఉత్పత్తిదారులకు లభించే విండ్‌ఫాల్ లాభాలను తగ్గించేందుకు  దేశీయంగా ఉత్పయ్యేు ముడిచమురుపై టన్నుకు రూ. 23,230 అదనపు పన్నును విధించినట్లు ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ‘ఇటీవలి నెలల్లో క్రూడ్ ధరలు బాగా పెరిగాయి. ఈ క్రమంలో... దేశీయంగా ముడిచమురు ఉత్పత్తిదారులు లాభాలనార్జిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని టన్నుకు రూ. 23,250 చొప్పున ముడిచమురుపై సెస్ విధింపు జరిగింది. కాగా... క్రూడ్ దిగుమతులు మాత్రం ఈ సెస్‌కు లోబడి ఉండవు’ అని ప్రభుత్వం తెలిపింది. కాగా... కిందటి ఆర్థిక సంవత్సరంలో రెండు మిలియన్ బ్యారెళ్ల కంటే తక్కువ వార్షిక ముడిచమురు ఉత్పత్తిని కలిగి ఉన్న చిన్న ఉత్పత్తిదారులకు సెస్ చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది. 


ప్రైవేట్ రంగ రిఫైనరీలు యూరప్, అమెరికా తదితర  మార్కెట్‌లకు ఇంధనాన్ని ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను పొందుతున్నాయన్న విషయం తెలిసిందే. ముడిచమురు ధరలు పెరుగుతున్నందున... రిఫైనర్లు ఇంధన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధరలకు ఎగుమతి చేస్తున్నాయని, అవి చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. కాగా... ఎగుమతులు లాభదాయకంగా మారుతున్నందున, కొన్ని రిఫైనర్లు దేశీయ మార్కెట్‌లో తమ ఉత్పత్తులను స్తంభింపజేస్తున్నట్లుగా వినవస్తోంది.

Updated Date - 2022-07-03T21:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising