ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!

ABN, First Publish Date - 2022-01-21T02:09:57+05:30

రెండు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో పెరగనున్నట్లు తెలుస్తోంది. బ్రెంట్​ క్రూడ్​ ఆయిల్ ధరలు గడిచిన నాలుగు వారాల్లో 25 శాతం పెరిగి, ఏడేళ్ల గరిష్ఠాన్ని తాకాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రెండు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో పెరగనున్నట్లు తెలుస్తోంది. బ్రెంట్​ క్రూడ్​ ఆయిల్ ధరలు గడిచిన నాలుగు వారాల్లో 25 శాతం పెరిగి, ఏడేళ్ల గరిష్ఠాన్ని తాకాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 87.99 డాలర్లుగా ఉంది. ఈ క్రమంలోనే... దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో పెరిగే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. గతేడాది నవంబరు ​ వరకు వరుసగా పెరుగతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు దీపావళి తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. దీపావళి కానుకగా...  పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ... కేంద్రం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం.


ఇక ప్రస్తుత పరిస్థితికొస్తే... ముడిచమురు ధరలు పెరిగిన నేపధ్యంలో  పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్​లో పెట్రోల్ ధర రూ. 108.18 వధ్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర రూ. 94.61 వద్ద ఉంది. దేశ  రాజధాని ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 95.45, డీజిల్ ధర రూ. 86.71 వద్ద కొనసాగుతున్నాయి. 

Updated Date - 2022-01-21T02:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising