ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల పెంపు అంచనాల నేపథ్యంలో... ప్రీ పాండమిక్ స్థాయికి... పెట్రోలు, డీజిల్ అమ్మకాలు * శుక్ర లేదా శనివారం... ధరల పెంపుపై ప్రకటన ?

ABN, First Publish Date - 2022-03-17T00:00:54+05:30

ధరల పెంపు అంచనాలు పెట్రోలు, డీజిల్ అమ్మకాలను ప్రీ-పాండమిక్ స్థాయికి నడిపించాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలకు సన్నాహకంగానా అన్నట్లుగా తెరమీదకొస్తోన్న వ్యాఖ్యల నేపథ్యంలో... ఇంధన విక్రయాలు 20 శాతం పెరిగాయని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రెండు రోజుల క్రితం(సోమవారం) ప్రకటించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ధరల పెంపు అంచనాలు పెట్రోలు, డీజిల్ అమ్మకాలను ప్రీ-పాండమిక్ స్థాయికి నడిపించాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలకు సన్నాహకంగానా అన్నట్లుగా తెరమీదకొస్తోన్న  వ్యాఖ్యల నేపథ్యంలో... ఇంధన విక్రయాలు 20 శాతం పెరిగాయని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రెండు రోజుల క్రితం(సోమవారం) ప్రకటించిన విషయం తెలిసిందే. నెలవారీగా పెట్రోల్ విక్రయాలు 18.8 శాతం, డీజిల్ అమ్మకాలు 32.8 శాతం పెరిగాయి. నెలవారీగా పెట్రోల్ విక్రయాలు 18.8 శాతం, డీజిల్ అమ్మకాలు 32.8 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశమున్నందున దేశీయ ఆటో ఇంధన అమ్మకాలు మార్చి మొదటి అర్ధభాగంలో మహమ్మారికి ముందు స్థాయిలను అధిగమించాయి.


మార్చి 1-15 మధ్య కాలంలో 1.23 మిలియన్ టన్నులతో మార్కెట్‌లో దాదాపు 90 శాతం నియంత్రణలో ఉన్న ప్రభుత్వ యాజమాన్య ఇంధన రిటైలర్ల పెట్రోలు విక్రయాలు గతేఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 18 శాతం అధికం. అంతేకాకుండా... 2019 కాలంతో పోలిస్తే 24.4 శాతం ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమిక పరిశ్రమ డేటా చెబుతోంది. దేశంలో ఎక్కువగా ఉపయోగించే ఇంధనం డీజిల్ విక్రయాలు సంవత్సరానికి 23.7 శాతం పెరిగి 3.53 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఇది మార్చి 1-15, 2019 అమ్మకాల కంటే 17.3 శాతం ఎక్కువ. మార్చి 1-15, 2020 మధ్య కాలంలో జరిగిన అమ్మకాల కంటే పెట్రోల్ అమ్మకాలు 24.3 శాతం ఎక్కువగా ఉండగా, అదే వ్యవధిలో డీజిల్ అమ్మకాలు 33.5 శాతం పెరిగాయి.  నెలవారీగా పెట్రోల్ విక్రయాలు 18.8 శాతం, డీజిల్ అమ్మకాలు 32.8 శాతం పెరిగాయి.


నవంబరు 2021 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం ఊపందుకున్నట్లే... పెట్రోల్, డీజిల్ ధరలు ఫ్రీజ్ బటన్‌ను తాకాయి. ముడిసరుకు ధర బ్యారెల్‌కు 81 అమెరికన్ డాలర్ల  నుండి 130 అమెరికన్ డాలర్లకు పెరిగినప్పటికీ... రికార్డు స్థాయిలో 132 రోజుల స్తంభన చోటుచేసుకుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత, ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేయడం ప్రారంభిస్తారని అంచనాలున్నాయి. కాగా... రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ధరల్లో మార్పు చోటుచేసుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే... శుక్ర, లేదా... శనివారం... పెట్రో ధరల పెంపునకు సంబంధించిన ప్రకటన వెలువడవచ్చని సంబనంధిత వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2022-03-17T00:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising