ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఓయో’... ఆపన్నహస్తం... శరణార్ధులకు ఉచిత వసతి...

ABN, First Publish Date - 2022-03-22T20:46:44+05:30

ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో... శరణార్ధులను ఆదుకునేందుకు, వారికి తమవంతు సాయాన్నందించేందుకు ‘ఓయో’ ముందుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో చేయూత

హైదరాబాద్ : ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో... శరణార్ధులను ఆదుకునేందుకు, వారికి తమవంతు సాయాన్నందించేందుకు ‘ఓయో’ ముందుకొచ్చింది. పోలాండ్‌లోని గృహయజమానులను మాత్రమే కాకుండా, ఇతర యూరోపియన్ దేశాల్లో ఉన్నవారిని కూడా వారి ఇళ్లకు చేర్చేలా చర్యలు ప్రారంభించింది. స్వచ్ఛంద విరాళాల కోసం తమ ఉద్యోగులు, ప్రజలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తూ నిధుల సమీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభించినట్లు ఓయో పేర్కొంది. 

స్వచ్ఛంద విరాళాల కోసం తమ ఉద్యోగులు, ప్రజలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తూ నిధుల సమీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభించినట్లు ఓయో తెలిపింది. 

హోంగ్రోన్ హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఓయో... ఉక్రెయిన్ నుండి పారిపోతున్న శరణార్థులకు ఉచిత వసతి కల్పిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. ప్లాట్‌ఫారమ్‌లోని 600 ప్లస్ బెల్విల్లా గృహయజమానులకు వారి హాలిడే హోమ్‌లను శరణార్థులకు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి కంపెనీ ప్రయత్నాలను ప్రారంభించింది. ‘ఈ సేవలు ఉచితంగానే అందుతాయి. ఇక... శరణార్థులకు ఆతిథ్యమివ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఇళ్ళ యజమానులు... శరణార్ధుల ఖర్చుల్లో కూడా కొంతమేర భరించాల్సి ఉంటుంది. కంపెనీ పరిపాలనాపరంగా మద్దతునివ్వనుంది. ఇక...  గృహయజమానులకయ్యే కార్యాచరణ ఖర్చులను కవర్ చేయడంలో సహాయపడనున్నట్లు ఓయో ఓ ప్రకటనలో తెలిపింది.


 ఈ చర్యపై... ఓయో వ్యవస్థాపకుడు/గ్రూప్ సీఈఓ  రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ ‘అవసరంలో ఉన్న వ్యక్తుల కోసం వారి ఇళ్లు, హృదయాలను తెరిచే మా ఇంటి యజమానుల నుండి మేం ప్రేరణ పొందాము. మేము వారికి మద్దతునివ్వడానికి కట్టుబడి ఉన్నాం. మేం చేయగలిగిన ప్రతీవిధంగా ఈ ప్రయత్నాన్ని నడిపిస్తున్నాం. ఐరోపా దేశాల్లోని శరణార్థులకు సాధ్యమైన అన్ని సహాయసహకారాలను అందించడానికి మేం ప్రతీ మార్గాన్ని అన్వేషించడం కొనసాగిస్తాం. ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న వసతితో శరణార్థులు సరిపోయేలా చూసేందుకు కంపెనీ స్థానికంగా పలు సంస్థలతో  చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. 

Updated Date - 2022-03-22T20:46:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising