ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి 60000కు సెన్సెక్స్‌

ABN, First Publish Date - 2022-09-10T06:23:32+05:30

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజు కూడా జోరును కొనసాగించింది. విదేశీ నిధుల రాక, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజు కూడా జోరును కొనసాగించింది. విదేశీ నిధుల రాక, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, రూపాయి బలపడడం సెంటిమెంట్‌ను బలపరిచింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో మానసిక అవధి 60000 పాయింట్లు దాటింది. లాభాల స్వీకారంతో ఆ స్థాయి నుంచి దిగజారినా చివరికి 104.92 పాయింట్ల లాభంతో 59793.14 వద్ద ముగిసింది. నిఫ్టీ 34.60 పాయింట్లు లాభపడి 17833.35 వద్ద ముగిసింది. దీంతో బీఎ్‌సఈలో లిస్టింగ్‌ అయిన కంపెనీల మార్కెట్‌ విలువ చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరింది. వరుస రెండు రోజుల లాభాలతో మార్కెట్‌ విలువ రూ.2,16,603.93 కోట్లు పెరిగి రూ.2,83,03,925.62 కోట్లకు చేరింది. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 989.81 పాయింట్లు, నిఫ్టీ 293.90 పాయింట్లు లాభపడ్డాయి.  


రూపాయిదీ అదే బాట: ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 12 పైసలు లాభపడి 79.57 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం 79.66 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 79.47-79.66 మధ్యన కదలాడింది.

Updated Date - 2022-09-10T06:23:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising