ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీవ్ర ఒత్తిడిలో... చమురు సంస్థలు

ABN, First Publish Date - 2022-05-18T20:40:43+05:30

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOC), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL) తదితర చమురు మార్కెటింగ్ కంపెనీ(OMC)లు ఈ రోజు(బుధవారం) తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOC), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL) తదితర చమురు మార్కెటింగ్ కంపెనీ(OMC)లు ఈ రోజు(బుధవారం) తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ఇదే క్రమంలో... స్టాక్‌లు 7 శాతం వరకు క్షీణించాయి. OMCలు లీటర్ పెట్రోల్‌పై రూ. 9-10, డీజిల్‌లో రూ. 25-30 మధ్య నష్టాలను ఎదుర్కొంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మధ్య ముడిచమురు ధరలు పెరగడంతో OMCలు దెబ్బతింటున్నాయి.


గ్లోబల్ ఇంధన ధరల పెరుగుదల మధ్య మార్చి 22 నుండి ఏప్రిల్ 6, 2022 మధ్య పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 మేర పెంపు చోటుచేసుకుందని సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ఒకరు పేర్కొన్నారు. ఈ పెంపుదల పరిహారం, ఎక్సైజ్, వ్యాట్ తగ్గింపునకు కారణమైంది. ముడిచమురు ధరలు భారీగా ఉన్నప్పటికీ, బ్యారెల్‌కు $112-$115 వరకు హెచ్చుతగ్గులకు గురవుతున్నప్పటికీ, ఏప్రిల్ 6, 2022 నుండి ధరల సవరణ జరగలేదు. ఈ కంపెనీలు ధరలను మరింతగా  పెంచడంలో విఫలమైనపక్షంలో... పరిస్థితి దారుణంగా క్షీణించే  అవకాశాలున్నాయని దూబే అంచనా వేశారు. ఇక... వ్యక్తిగతంగా, షేర్లు దాదాపు 7 శాతం క్షీణించడంతో HPCL స్టాక్ చాలావరకు పడిపోయింది. హెచ్‌పీసీఎల్ కూడా బీస్‌ఈ ఇంట్రాడేలో ఒక్కో షేరుకు రూ. 238.8 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది.


IOC షేర్లు 4 శాతంపైగా క్షీణించగా, నాలుగో త్రైమాసికం ఫలితాల కంటే తక్కువ అంచనాలు సహా ఒక్కో షేరుకు రూ. 119 కు చేరుకుంది. అలాగే... ఉపసంహరణ-బౌండ్ BPCL షేర్లు కూడా బుధవారం సెషన్‌లో బలహీనంగా ఉన్నాయి. దాదాపు 2 శాతం తగ్గి ఒక్కో షేరుకు రూ. 336.5 వద్ద 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. బీపీసీఎల్‌లో వాటాల విక్రయానికి ప్రభుత్వం మరింత సమయం తీసుకునే అవకాశముందని, దాని విక్రయ నిబంధనలను సవరించాలని గత నెలలో నివేదికలు వెలువడ్డాయి. ముడిచమురు ధరలు మంగళవారం బ్యారెల్‌కు $ 115 కు పైగా పెరిగాయి, ఇది సుమారు ఏడు వారాల్లో అత్యధికం. యూరోపియన్ యూనియన్ సరఫరాను కఠినతరం చేసే రష్యన్ చమురు దిగుమతులపై నిషేధం కోసం ఒత్తిడి తెస్తుంది.

Updated Date - 2022-05-18T20:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising