ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్ను ప్రయోజనాలు వివరిస్తూ మహాభారత శ్లోకాలను ప్రస్తావించిన నిర్మలమ్మ

ABN, First Publish Date - 2022-02-01T21:58:21+05:30

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి పన్ను ప్రయోజనాల గురించి వివరిస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో మహాభారతంలోని శ్లోకాలను గుర్తు చేసుకున్నారు. ‘ప్రత్యక్ష పన్నులు’ గురించి మంత్రి వివరిస్తూ.. మహాభారతం శాంతిపర్వంలోని శ్లోకాలను వల్లించారు. ప్రజల యోగక్షేమాలే లక్ష్యంగా ముందుకు సాగాలని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజు ధర్మానుసారంగా పాలిస్తూ ప్రజల సంక్షేమానికి ఏర్పాట్లు చేయాలని అన్నారు. 


మొత్తంగా 90 నిమిషాలపాటు నిర్మల బడ్జెట్ ప్రసంగం సాగింది. పన్ను చెల్లింపుదారుల కోసం ఓ కొత్త నిబంధనను ప్రతిపాదిస్తున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదనపు ట్యాక్స్ చెల్లింపుల అప్‌డేటెడ్ రిటర్న్స్‌కు ఇది అనుమతిస్తుందన్నారు. సంబంధిత అసెస్‌మెంట్ ముగిసిన రెండు సంవత్సరాలలో ఈ అప్‌డేటెడ్ రిటర్న్స్‌ను ఫైల్ చేయవచ్చన్నారు.


లిటిగేష్ తగ్గించడానికి, స్వచ్ఛంద పన్ను చెల్లింపునకు ఈ కొత్త నిబంధన అనుమతిస్తుందని చెప్పారు. అలాగే, కొన్ని రసాయనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్టు చెప్పారు. సూక్ష, మధ్య తరహా పరిశ్రమల కోసం స్టీల్ తుక్కుపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్టు చెప్పారు.   

Updated Date - 2022-02-01T21:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising