ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త కొలువులు.. మరిన్ని నియామకాలు

ABN, First Publish Date - 2022-05-22T06:53:54+05:30

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టిన నేపథ్యంలో కొత్త ఉద్యోగావకాశాలు, నియామకాలపై కార్పొరేట్‌ రంగం ఆశావహంగా ఉందని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైరింగ్‌పై కార్పొరేట్‌ రంగం ఆశావహం  జీనియస్‌ కన్సల్టెంట్స్‌ సర్వే నివేదిక వెల్లడి 


ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టిన నేపథ్యంలో కొత్త ఉద్యోగావకాశాలు, నియామకాలపై కార్పొరేట్‌ రంగం ఆశావహంగా ఉందని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో నియామకాలు, వలసలు, పారితోషికం ట్రెండ్స్‌పై ఈ కన్సల్టింగ్‌ సంస్థ సర్వే నివేదికను విడుదల చేసింది. 2022-23లో కొత్త పోస్ట్‌ల కోసం మరిన్ని నియామకాలుంటాయని సర్వేలో పాల్గొన్న 72 శాతం కంపెనీలు విశ్వసిస్తున్నాయి. ప్రస్తుత స్థానాలను భర్తీ చేయనున్నట్లు మరో 18 శాతం కంపెనీలు సంకేతాలిచ్చాయి. కంపెనీలు తమ మానవ వనరులను మరింత బలోపేతం చేసేందుకు అంతర్గత సమీక్ష జరుపుతున్నాయని రిపోర్టు వెల్లడించింది. ఆటో, వాహన విడిభాగాలు, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, నిర్మాణం, ఇంజనీరింగ్‌, ఎడ్యుకేషన్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆతిథ్యం, మానవ వనరులు, ఐటీ, ఐటీఈఎస్‌, బీపీఓ, లాజిస్టిక్స్‌, మాన్యుఫాక్చరింగ్‌, మీడియా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫార్మా, మెడికల్‌, పవర్‌, ఎనర్జీ, రియల్టీ, రిటైల్‌, టెలికాం రంగాలకు చెందిన 1,260 మంది ఎగ్జిక్యూటివ్‌ స్థాయి మేనేజర్లు, హెచ్‌ఆర్‌ అధికారులను ఈ మార్చి-ఏప్రిల్‌ కాలంలో సర్వే చేసినట్లు జీనియస్‌ కన్సల్టెంట్స్‌ తెలిపింది. 


కంపెనీల అభిమతమిదీ.. 

4%    ఉద్యోగుల సంఖ్య మరో 10-15 శాతం పెంచుకోవాలనుకుంటున్నాం 

30%   కొత్త ఉద్యోగులతో ప్రస్తుత టీమ్‌ను 10 శాతం మేర పెంచే యోచన 

15%     మొత్తం ఉద్యోగుల సంఖ్యను 10 శాతానికి పైగా పెంచే ఆలోచన 

20%   ఈ ఏడాది కొత్త నియామకాలు ఉండకపోవచ్చు



ఎవరికి అవకాశం? 

పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు 

మార్కెటింగ్‌

ఎంబీఏ 

ఇంజనీరింగ్‌ 

ఇతరులు 


మేల్‌ వర్సెస్‌ ఫిమేల్‌ 

46%  మొత్తం ఉద్యోగుల్లో మహిళలు, మగవారు సమ నిష్పత్తిలో ఉండేలా నియామకాలు

54%  మగవారు లేదా మహిళలు అధికంగా ఉండేలా నియామకాలు


మధ్య, సీనియర్‌ స్థాయిల్లోనే వలసలెక్కువ

జూనియర్‌ ఉద్యోగుల కంటే మధ్య, సీనియర్‌ స్థాయి ఉద్యోగులే కంపెనీని వీడే అవకాశాలెక్కువగా ఉన్నాయని సర్వేలో పాల్గొన్న 58 శాతం సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఏడాది ఉత్తరాది మార్కెట్లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ వలసలు అధికంగా ఉండవచ్చని వారు భావిస్తున్నారు. 


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

కరోనా సంక్షోభ కాలంతో మొదలైన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) ట్రెండ్‌ మున్ముందూ కొనసాగనుందని నివేదిక పేర్కొంది. డబ్ల్యూఎఫ్‌హెచ్‌ తమ సంస్థలో ఓ భాగంగా మారిందని, 20 శాతానికి పైగా సిబ్బంది ఇప్పటికీ ఇంటి నుంచే పనిచేస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న 33 శాతానికి పైగా ప్రతినిధులు తెలిపారు. ఈ వర్కింగ్‌ మోడల్‌ దివ్యాంగులకు మరిన్ని ఉద్యోగావకాశాలను కల్పి స్తోందని, దాంతో కంపెనీల్లో వీరి నియామకాలు 15-20 శాతం మేర పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. 

Updated Date - 2022-05-22T06:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising