ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 10 లక్షలకు పైబడిన చెల్లింపులు... చెక్ ద్వారా చెల్లించేపక్షంలో... కొత్త నిబంధనలు...

ABN, First Publish Date - 2022-03-02T00:29:28+05:30

చెక్కుల ద్వారా జరిపే చెల్లింపులకు సంబంధించి... ప్రభుత్వరంగ పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) కీలకమైన మార్పులు తీసుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

*  పీఎన్‌బీలో మార్చి 4 నుంచి అమల్లోకి... 

హైదరాబాద్ : చెక్కుల ద్వారా జరిపే చెల్లింపులకు సంబంధించి... ప్రభుత్వరంగ పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. రూ. 10 లక్షలు, లేదా... ఆపైబడిన విలువ గల చెక్‌లను సెటిల్‌మెంట్ చేసే ప్రక్రియకు సంబంధించి... జారీ చేసిన వ్యక్తి నుంచి మరోమారు ృవీకరణ వచ్చిన తర్వాతే... చెక్ చెల్లింపుల ప్రక్రియను బ్యాంకు చేపడుతుంది. వాస్తవానికి కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. కాగా... పీఎన్‌బీకి సంబంధించి... చెక్ పేమెంట్లకు వచ్చిన కొత్త నిబంధనలిలు ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. మోసాల నుంచి ప్రజలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాలిలా  ఉన్నాయి. 


ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) చెక్ చెల్లింపుల విషయంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. రూ. 10 లక్షలు, లేదా... ఆపై విలువ గల చెక్‌లను సెటిల్‌మెంట్ చేసే విషయంలో జారీ చేసిన వ్యక్తి నుంచి ధృవీకరణ వచ్చిన తర్వాతే... చెక్ చెల్లింపుల ప్రక్రియను చేపడతామని బ్యాంకు పేర్కొంది. ఏప్రిల్ 4 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.


పెద్ద మొత్తాల చెక్‌ల విషయంలో మోసాల బారి నుంచి బ్యాంకు కస్టమర్లను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఎన్‌బీ పేర్కొంది. ఈ క్రమంలో... పాజిటివ్ పేమెంట్ సిస్టమ్(పీపీఎస్) ఏప్రిల్ 4 నుంచి  అమల్లోకి తీసుకురానున్నామని పేర్కొంది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం... రూ. 50 వేలు, ఆపైబడిన మొత్తాల చెక్‌ల క్లియరెన్స్‌కు సీటీఎస్(చెక్ ట్రంకేషన్ సిస్టమ్)ను అమలు పరుస్తోంది. సీటీఎస్ అన్నది చెక్‌లను ఎలక్ట్రానిక్‌గా క్లియర్ చేసే విధానం. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ డియా(ఎన్‌పీసీఐ) పాజిటివ్ పేమెంట్ సిస్టమ్‌ను రూపొందించింది. ఈ క్రమంలో... కస్టమర్లు జారీ చేసే పెద్ద మొత్తాల చెక్‌లను పలు ముఖ్యమైన సమాచారాలతో రీనిర్ధారించుకోంాల్సి  ఉంటుంది. చెక్ పేమెంట్ సెటిల్ కాకముందే ఈ వివరాలను రీవెరిఫై చేయాలి. దీని కోసం పీపీఎస్ కింద అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్ అల్ఫా కోడ్, జారీ చేసిన తేదీ, మొత్తం, లబ్దిదారుల పేరు తదితర వివరాలను బ్యాంకు యంత్రాంగం ధృవీకరచుకుంటుంది. 

Updated Date - 2022-03-02T00:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising