ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరింత కుంగింది

ABN, First Publish Date - 2022-10-08T09:14:16+05:30

డాలర్‌ మారకంలో రూపాయి విలువ రోజురోజుకీ క్షీణిస్తోంది. శుక్రవారం మరో 13 పైసలు నష్టపోయి చారిత్రక కనిష్ఠ స్థాయి రూ.82.30 వద్ద ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాలర్‌కు రూ.82.30

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ రోజురోజుకీ క్షీణిస్తోంది. శుక్రవారం మరో 13 పైసలు నష్టపోయి చారిత్రక కనిష్ఠ స్థాయి రూ.82.30 వద్ద ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో ఉదయం 82.19 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రా డేలో ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి 82.43ని తాకింది. చివరికి కొద్దిగా కోలుకున్నా గురువారం నాటి ముగింపుతో పోలిస్తే 13 పైసలు నష్టంపోయి  రూ.82.30 వద్ద ముగిసింది. రెండు రోజుల్లో రూపాయి 68 పైసలు నష్టపోయింది. స్టాక్‌ మార్కెట్‌ ఫ్లాట్‌గా ముగియడం, చమురు సెగ రూపాయి పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు మరింత పెంచబోతోందన్న వార్తలు, రోజు రోజుకీ పెరుగుతున్న ఆర్థిక మాంద్యం భయాలూ రూపాయిని వెంటాడుతున్నాయి. 


ప్రభావం: డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పౌరుల వ్యక్తిగత జీవితాలనూ ప్రభావితం చేయనుంది. ముడి చమురుతో పాటు అన్ని రకాల దిగుమతులు మరింత ప్రియం కానున్నాయి. చమురు ధర పెరగడం కంటే రూపాయి మారకం రేటు కుదేలవడమే ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలను ఎక్కువగా భయపెడుతోంది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన స్మార్ట్‌ఫోన్ల వంటి వినియోగ ఎలకా్ట్రనిక్‌ పరికరాలూ మరింత ప్రియం కానున్నాయి. దీంతో డాలర్‌తో రూపాయి మారకం రేటుని స్థిరీకరించడం ఆర్‌బీఐకి కత్తిమీద సాము కానుంది. 


తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు : సెప్టెంబరు 30వ తేదీతో ముగిసిన వారానికి విదేశీ మారకం నిల్వలు మరో 485.4 కోట్ల డాలర్లు తగ్గి 53,266.4 కోట్ల డాలర్లకు దిగివచ్చాయి. గత ఏడాది అక్టోబరులో ఇవి 64,500 కోట్ల చారిత్రక గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. అలాగే బంగారం నిల్వలు కూడా 28.1 కోట్ల డాలర్లు తగ్గి 3706.5 కోట్ల డాలర్లకు తగ్గాయి. 


రిలీఫ్‌ ర్యాలీకి బ్రేక్‌

స్టాక్‌మార్కెట్‌లో రెండు రోజుల రిలీఫ్‌ ర్యాలీకి వారాంతంలో బ్రేక్‌ పడింది. లాభాల స్వీకణ అమ్మకాలతో సెన్సెక్స్‌ 30.81 పాయింట్ల నష్టంతో 58,191.29 వద్ద, 17.15 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 17,314.65 వద్ద ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ ఒక దశలో  370.95 పాయింట్ల వరకు నష్టపోయింది. ఐటీ, ఫైనాన్సియల్‌ కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ అమ్మకాలు ఎక్కువగా కనిపించాయి. 

Updated Date - 2022-10-08T09:14:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising