ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meta: హైదరాబాద్‌లో క్రియేటర్స్ డే నిర్వహించిన ‘మెటా’

ABN, First Publish Date - 2022-10-16T02:39:41+05:30

ఫేస్‌బుక్‌గా అందరికీ చిరపరిచితమైన మెటా(Meta) శనివారం హైదరాబాద్‌లో తొలిసారి క్రియేటర్స్ డే నిర్వహించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఫేస్‌బుక్‌గా అందరికీ చిరపరిచితమైన మెటా(Meta) శనివారం హైదరాబాద్‌లో తొలిసారి క్రియేటర్స్ డే నిర్వహించింది. ఇందులో క్రియేటర్ల కోసం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. మెటా(Meta)తో కలిసి పనిచేయడంతోపాటు సొంత అగుమెంటెడ్ రియాలిటీ (AR) ఎఫెక్ట్స్‌ను పొందవచ్చు. తమ ఇన్‌‌స్టాగ్రామ్ ఖాతాలపై అనుసంధానిత, వృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఒకరి నుంచి మరొకరు నేర్చుకునేందుకు, సహకరించుకునేందుకు, క్రియేట్ చేసేందుకు క్రియేటర్స్ డే అవకాశాలను అందిస్తుంది. ఈ ఏడాది క్రియేటర్స్ డే కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో జరుగుతున్నాయి. తొలిసారి ముంబైలో జరిగింది. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక్కడ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో తమ అభిమాన క్రియేటర్లను కలుసుకోవడం, వారితో మాట్లాడడం వంటి అవకాశాలను అభిమానులకు మెటా అందించింది. దీని ద్వారా వారితో బంధాన్ని మరింత బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది. 


ఈ కార్యక్రమంలో క్రియేటర్ల కోసం నూతన ప్రోగ్రాంను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు మెటా తెలిపింది. గతేడాది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పరీక్షించిన తర్వాత ఎంపిక చేసిన క్రియేటర్లు ఇప్పుడు మెటా స్పార్క్ క్రియేటర్లతో కలిసి పనిచేస్తున్నారు.  ఈ మెటా స్పార్క్‌ క్రియేటర్లు,  మెటా స్పార్క్‌ ప్లాట్‌ఫామ్‌ వినియోగించుకుని తమ ఏఆర్‌ ఎఫెక్ట్స్‌ను ప్రచురించడం, నిర్వహించడం, ట్రాక్ చేయడం వంటివి చేస్తారు. ఫలితంగా వినోదాత్మక, ఆసక్తికరమైన ఏఆర్‌ ఎఫెక్ట్స్‌ సాధ్యమవుతాయి. ఇవి ఎంపిక చేసిన క్రియేటర్ల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై లభ్యమవుతాయి. ఎంపికైన క్రియేటర్లలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఉంటారు. వీరిలో  కొందరు హైదరాబాదీలు ఉన్నారు. గత కొన్ని రోజుల్లోనే 15 ఎఫెక్ట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని డిసెంబర్‌ చివరి నాటికి అందుబాటులో ఉండనున్నాయి.


ఫేస్‌బుక్ ఇండియా (meta) డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ పార్టనర్‌షిప్స్ మనీష్ చోప్రా మాట్లాడుతూ.. క్రియేటర్లకు తాము అతిపెద్ద అభిమనులమని అన్నారు. సంస్కృతికి ఓ ఆకృతిని అందిస్తున్నది వీరేనని కొనియాడారు. వీరిని దృష్టిలో  ఉంచుకుని తమ ఉత్పత్తుల్లో అత్యధిక శాతం రూపొందిస్తున్నట్టు చెప్పారు.  అందుకు  రీల్‌ అత్యుత్తమ ఉదాహరణ అని పేర్కొన్నారు. నూతన ఏఆర్‌ ప్రోగ్రాంను విడుదల చేసినందుకు సంతోషంగా ఉన్నట్టు చెప్పారు.  దీనిద్వారా  క్రియేటర్లు  మరింతగా లీనమయ్యే అనుభవాలను సృష్టించడంలో సహాయపడటంతో పాటుగా  తమ అభిమానులతో  మరింత లోతైన అనుబంధం ఏర్పరుచుకోవడంలో సహాయపడనున్నట్టు వివరించారు. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి  రష్మిక మందన్న తన ప్రదర్శనతో  ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో అత్యున్నత క్రియేటర్లును ఓ దరికి చేర్చి ఈ  కార్యక్రమం ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రీల్స్‌తో మీరు సంస్కృతులను నిర్వచిస్తున్నారు. తాము చేసిన సినిమాలు, వాటిలోని పాత్రల ద్వారా మీరు స్ఫూర్తి పొంది ఉండవచ్చేమో కానీ  మీ ద్వారా నేను కూడా స్ఫూర్తి పొందానని ఆమె అన్నారు.  హైదరాబాద్‌లోని ఈవెంట్‌ కోసం క్రియేటర్లు నిహారిక ఎన్‌ఎం(@niharika_nm ),  షణ్ముఖ్‌ జస్వంత్‌ కంద్రేగుల (@shannu_7), అలేఖ్య హారిక (@alekhyaharika_), గీతా మాధురి (@singergeethamadhuri),  ప్రణవి మానుకొండ (@pranavi_manukonda),  మున్నాభాయ్‌ గేమింగ్‌ (@munnabhai_gaming) లు అంబాసిడర్లుగా వ్యవహరించారు.



Updated Date - 2022-10-16T02:39:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising