ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ గాడిలోకి ఔషధ ఎగుమతులు

ABN, First Publish Date - 2022-01-23T07:52:54+05:30

వరుసగా మూడు నెలలు క్షీణించిన ఔషధ ఎగుమతులు మళ్లీ గాడిలో పడ్డాయ్‌. ఏడా ది క్రితం ఇదే నెలతో పోలిస్తే డిసెంబరు నెలకు ఔషధ ఎగుమతులు 5.2 శాతం పెరిగి 220 కోట్ల డాలర్ల నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స):వరుసగా మూడు నెలలు క్షీణించిన ఔషధ ఎగుమతులు మళ్లీ గాడిలో పడ్డాయ్‌. ఏడా ది క్రితం ఇదే నెలతో పోలిస్తే డిసెంబరు నెలకు ఔషధ ఎగుమతులు 5.2 శాతం పెరిగి 220 కోట్ల డాలర్ల నుంచి 232 కోట్ల డాలర్లకు చేరాయి. డిసెంబరు నెలకు ఔషఽ ద ఎగుమతులు దాదాపు 5 శాతం పెరిగాయని ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మాగ్జిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో ఔషధ ఎగుమతులు క్షీణించాయి. 


లక్ష్యం చేరకపోవచ్చు: డిసెంబరులో ఔషధ ఎగుమతుల్లో వృద్ధి నమోదైనప్పటికీ.. మొత్తం  ఏడాదికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2021-22కు 2,900 కోట్ల డాలర్ల (దాదాపు రూ.2,17,500 కోట్లు) ఔషధాలను ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కాగా మొదటి తొమ్మిది నెలలకు 1,818 కోట్ల డాలర్ల ఔషధాలను మాత్రమే ఎగుమతి చేయగలిగినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితంతో పోలిస్తే మొదటి తొమ్మిది నెలలకు ఎగుమతులు స్వల్పంగా 0.62 శాతం పెరిగాయి. రవాణా రేట్లు పెరగడం తదితర అంశాలు గత నెలల్లో ఔషధ ఎగుమతులు తగ్గడానికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఔషధ ఎగుమతులు 2,600 కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 2,440 కోట్ల డాలర్ల ఔషధాలను ఎగుమతి చేశారు. 

Updated Date - 2022-01-23T07:52:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising