ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

300 Top Selling Medicines: కేంద్రం కీలక నిర్ణయం.. మెడికల్ షాప్‌కు వెళ్లి మందులు కొనుక్కునే వాళ్లు ఇకపై..

ABN, First Publish Date - 2022-10-03T19:15:07+05:30

‘కాదేదీ కల్తీకి అనర్హం’ అన్నట్లుగా ప్రస్తుతం అంతా కల్తీ మయం అయిపోయింది. తయారీదారులు వినియోగదారుల ఆరోగ్యాల్ని విస్మరించి కల్తీలు చేసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కాదేదీ కల్తీకి అనర్హం’ అన్నట్లుగా ప్రస్తుతం అంతా కల్తీ మయం అయిపోయింది. తయారీదారులు వినియోగదారుల ఆరోగ్యాల్ని విస్మరించి కల్తీలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం మొదలుకుని జబ్బు చేస్తే వాడే మందుల దాకా అన్నింటిలో కల్తీ పెరిగిపోయింది. ఫేక్ మందుల తయారీ బిజినెస్ చాప కింద నీరులా విస్తరించిన ప్రస్తుత పరిస్థితుల్లో అసలు మందులేవో, నకిలీ మందులేవో గుర్తించడం సవాల్‌గా మారింది. దీంతో.. ప్రజలను నకిలీ మందుల (Fake Medicines) బారి నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. మెడికల్ షాపుల్లో (Medical Shops) నకిలీ మందులను గుర్తించేందుకు క్యూఆర్ కోడ్‌ను (Medicines QR Codes) అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విధానం వల్ల వినియోగదారులు సులభంగా నకిలీ మందులేవో, అసలు మందులేవో గుర్తించవచ్చు.



తొలి దశలో ఎక్కువగా వాడుకలో ఉండే 300 మందులను (300 Top Selling Medicines) ఈ ‘Track and Trace’ విధానంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బార్‌కోడ్స్ (Bar Codes) లేదా క్యూఆర్ కోడ్స్‌ను (QR Codes) ఆ మందుల ప్రైమరీ ప్యాకేజింగ్ లేబుల్స్‌పై (Primary Packaging Labels) ఉంచనున్నారు. ఈ దశలో యాంటీబయాటిక్స్ (Antibiotics), కార్డియాక్(Cardiac), పెయిన్ రిలీఫ్ పిల్స్(Pain-relief Pills), యాంటీ అలర్జిక్ మెడిసిన్స్‌పై (Anti-allergic Medicines).. అవి కూడా 100 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేసే స్ట్రిప్స్‌పై ఈ క్యూఆర్ కోడ్ ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానంలో భాగంగా నకిలీ మందులను, అసలు మందులను వినియోగదారుడు ఎలా నిర్ధారించవచ్చో తెలుసుకుందాం..


* వినియోగదారుడు మెడికల్ షాప్‌కు వెళ్లి ఈ 300 రకాల మందుల్లో ఏ ఒక్కటి కొనుగోలు చేసినా ఆ స్ట్రిప్‌పై లేదా బాటిల్‌పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.


* ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌కు వెళుతుంది. ఆ డ్రగ్‌కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. ఐడెంటిఫికేషన్ కోడ్, ఆ డ్రగ్ జెనరిక్ పేరు, బ్రాండ్ పేరు, మ్యాన్యుఫ్యాక్చరర్ పేరు, అడ్రస్.. బ్యాచ్ నంబర్, ఆ మందు తయారైన తేదీ.. ఎక్స్‌పైరీ డేట్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ లైసెన్స్ నంబర్ కనిపిస్తాయి.


* Unique ID codeను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పేస్ట్ చేసి మొబైల్ ఫోన్ ద్వారా వినియోగదారుడు ట్రాక్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.


* మొదటి విడతలో 300 Top Selling Medicines పై ఈ బార్‌కోడ్స్‌ను ప్రైమరీ ప్యాకేజింగ్‌లో ప్రింట్ చేయనున్నారు.


* ఈ విధానంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నప్పటికీ అమల్లోకి రావడానికి కొన్ని వారాల సమయం పట్టొచ్చని తెలుస్తుంది. అంతేకాదు.. మెడిసిన్స్ ధరలు కూడా 3 నుంచి 4 శాతం వరకూ పెరిగే అవకాశం కూడా ఉంది.


* కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ డేటాబేస్ ఏజెన్సీని ఏర్పాటు చేసి సింగిల్ బార్‌కోడ్‌తో వినియోగదారుడు అది ఫేక్ మెడిసినో లేదా ఒరిజినల్ మెడిసినో తెలుసుకునేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-10-03T19:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising