చమురు కంపెనీలకు మార్కెటింగ్ స్వేచ్ఛ
ABN, First Publish Date - 2022-06-30T09:05:55+05:30
చమురు కంపెనీలకు మార్కెటింగ్ స్వేచ్ఛ
కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ : దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చమురును దేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు రిఫైనరీలు వేటికైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పించింది. అక్టోబరు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అయితే దేశీయంగా ఉత్పత్తి చేసే చమురు ఎగుమతులపై ఉన్న నిషేధం మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. దీంతో దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి చేసే ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, వేదాంత కంపెనీలకు మేలు జరగనుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశీయంగా ఉత్పత్తి చేసే చమురును కంపెనీలు ప్రభుత్వం నిర్ణయించిన కంపెనీలకు, అది కూడా నిర్ణీత పరిమాణంలో మాత్రమే అమ్మాలి. కొత్త నిర్ణయంతో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, వేదాంత తాము ఉత్పత్తి చేసే ముడి చమురును ఇ-వేలం ద్వారా దేశీయ రిఫైనరీలు వేటికైనా అమ్ముకోవచ్చు. ఈ నిర్ణయంతో చమురు ఉత్పత్తి కంపెనీల ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
Updated Date - 2022-06-30T09:05:55+05:30 IST