ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Goonjతో చేతులు కలిపిన Lyfestyle

ABN, First Publish Date - 2022-07-06T00:23:21+05:30

దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ కేంద్రం లైఫ్‌స్టైల్ (Lifestyle) తాజాగా ఎన్జీవో గూంజ్‌ (Goonj)తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ కేంద్రం లైఫ్‌స్టైల్ (Lifestyle) తాజాగా ఎన్జీవో గూంజ్‌ (Goonj)తో చేతులు కలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 60 లైఫ్‌స్టైల్ స్టోర్ల వద్ద డొనేషన్ బాక్స్‌ (Donation Box)లను ఏర్పాటు చేయనుంది. వినియోగించని వస్త్రాలను ఈ డొనేషన్ బాక్స్‌లో వేస్తే వాటిని రీసైక్లింగ్ చేసి నిరుపేదలకు వాటిని అందిస్తారు. నగరంలోని ఒసాసిస్ మాల్ స్టోర్ వద్ద సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లైఫ్‌స్టైల్, గూంజ్ ప్రతినిధులు డొనేషన్ బాక్స్‌లను ప్రారంభించారు. 


డొనేషన్ బాక్స్‌ల ద్వారా సేకరించే వస్త్రాలను రీసైకిల్ వినియోగిస్తుంది. ఫలితంగా ఫ్యాషన్ వస్త్రాలు పెద్దమొత్తంలో భూగర్భంలో కలిసిపోయే ప్రమాదం తప్పుతుంది. ఈ సందర్భంగా లైఫ్‌స్టైల్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోహిణి హల్డియా (Rohini Haldea) మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల ప్రజల అభ్యున్నతికి, వారి గౌరవాన్ని పెంపొందించే దిశగా ప్రయత్నాలను చేస్తోన్న గూంజ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సమాజ అభివృద్ధి అనేది సమ్మిళిత బాధ్యత అని లైఫ్‌స్టైల్‌ బలంగా విశ్వసిస్తోందన్నారు. తక్కువగా వినియోగించే ఫ్యాషన్‌ను  రీసైక్లింగ్‌ చేసే అవకాశం కల్పించడం ద్వారా దీనిని  సాధ్యం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.


గూంజ్‌ ఫౌండర్‌, మెగసెస్సే అవార్డు గ్రహీత అన్షు గుప్తా (Anshu Gupta) మాట్లాడుతూ..  లైఫ్‌స్టైల్‌తో కలిసి ప్రారంభించిన ఈ కార్యక్రమం ఎన్నో రకాలుగా అత్యంత కీలకమైనదని అన్నారు. మొత్తం రిటైల్‌ రంగానికి అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తుందన్నారు.  ప్రతి సంస్ధ తమంతట తాముగా ఏం చేయవచ్చనేది ఈ కార్యక్రమం తెలియజేస్తుందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ప్రతి వినియోగదారుడు ఇతరుల కోసం ఎంతో కొంత సహాయం చేసే అవకాశం కల్పిస్తుందన్నారు.   


ఈ కంట్రిబ్యూషన్‌ బాక్స్‌లను బెంగళూరు,  మంగళూరు, మైసూర్‌, చెన్నై, కోయంబత్తూరు, హైదరాబాద్‌ , న్యూఢిల్లీ, గుర్‌గావ్‌, నోయిడా,  ఘజియాబాద్‌, లక్నో, కాన్పూరు, జైపూర్‌, చండీగఢ్, ముంబై, నవీ ముంబై, పూణె, అహ్మదాబాద్‌, నాగ్‌పూర్‌, కోల్‌కతా, భుబనేశ్వర్‌, ఇండోర్‌, గౌహతితోపాటు మరికొన్ని చోట్ల ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-07-06T00:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising