ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LIC: ఎల్ఐసీ నుంచి బ్రహ్మండమైన పాలసీ.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు కంటే ఎక్కువ డబ్బు..

ABN, First Publish Date - 2022-10-18T03:16:55+05:30

వినియోగదార్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను ప్రవేశపెట్టే ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) మరో స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వినియోగదార్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను ప్రవేశపెట్టే ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) మరో స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ‘ఎల్ఐసీ ధన్‌ వర్ష’ ( LIC Dhan Varsha) పేరిట పాలసీ నంబర్ 866ను ఆవిష్కరించింది. ఈ స్కీమ్ నాన్-లింక్డ్(మార్కెట్లతో సంబంధం ఉండదు), నాన్-పార్టిసిపేటింగ్ (లాభాల్లో వాటాలు, డివిడెంట్లు ఉండవు), సేవింగ్స్, వ్యక్తిగత, జీవిత బీమా ప్లాన్ అని పేర్కొంది. ఈ పాలసీతో పలు విధాల బీమా రక్షణతోపాటు సేవింగ్స్ ఆఫర్ చేస్తున్నట్టు ఎల్ఐసీ వెల్లడించింది. ఈ స్కీమ్‌లో పాలసీదారుడు దురదృష్టవశాత్తూ చనిపోయినప్పుడు కుటుంబానికి ఆర్థిక చేయూత అందడమే కాకుండా పెట్టుబడి రెట్టింపు కంటే ఎక్కకువవుతుందని వివరించింది. పాలసీ మెచ్యూరిటీపై ఏకమొత్తం సొమ్ము గ్యారంటీగా లభిస్తుందని తెలియజేసింది.


ఎల్ఐసీ ధన్ వర్ష 866 ప్లాన్ ప్రయోజనాలివే..

- పాలసీ టర్మ్ సమయంలో మెచ్యూరిటీ పూర్తవ్వకముందే పాలసీదారుడు దురదృష్టవశాత్తూ చనిపోతే ‘డెత్ బెనిఫిట్స్’ వర్తిస్తాయి. డెత్‌పై సమ్ అష్యూర్డ్‌తోపాటు ‘గ్యారంటీడ్ అడిషన్స్’ లభిస్తాయి.

- మెచ్యూరిటీ తేది పూర్తయితే బేసిక్ సమ్ అష్యూర్డ్‌తోపాటు గ్యారంటీడ్ అడిషనల్స్ చెల్లించబడతాయి.

- గ్యారంటీడ్ అడిషన్స్: పాలసీ ఏడాది చివరిలో గ్యారంటీడ్ అడిషన్స్‌ను చెల్లిస్తారు. పాలసీ టర్మ్ అయిపోయేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎంచుకునే ఆప్షన్, బేసిక్ సమ్ అష్యూర్డ్, పాలసీ టర్మ్‌ని బట్టి ఈ గ్యారంటీడ్ అడిషన్స్ ఆధారపడి ఉంటాయి.

- 15 ఏళ్ల పాలసీకి కనీస వయసు 3 సంవత్సరాలు.. కాగా 10 ఏళ్ల టర్మ్ పాలసీకి 8 సంవత్సరాలుగా ఉంది.

- పాలసీ లోన్: ఈ పాలసీ టర్మ్ ఉన్నంతకాలం ఏ సమయంలోనైనా పాలసీదారుడు లోన్ తీసుకోవచ్చు. పాలసీ మొదలైన 3 నెలల నుంచి పూర్తయ్యే వరకు ఈ అవకాశం ఉంటుంది.


రెట్టింపు సొమ్ము ఇలా..

30 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఎల్ఐసీ ధన్ వర్ష ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నారనుకుందాం. వన్‌టైమ్ ప్రీమియంగా రూ.8,86,750 (జీఎస్టీతో కలిపి రూ.9,26,654) చెల్లిస్తే.. సమ్ అష్యూర్డ్ రూ.11,08,438 కాగా బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.10,00,000గా ఉంటాయి. పాలసీ టర్మ్ 15 ఏళ్లు అనుకుంటే  పాలసీదారుడికి మెచ్యూరిటీపై రూ.21,25,000 లభిస్తుంది. ఒకవేళ మొదటి ఏడాదిలో మరణం సంభవిస్తే కనీస మొత్తం రూ.11,83,438 లభిస్తుంది. ఒకవేళ 15వ ఏడాదిలో చనిపోతే రూ.22,33,438 దక్కుతుంది.

Updated Date - 2022-10-18T03:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising