ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Koo: తెలంగాణ ప్రభుత్వంతో కూ ఎంవోయూ.. హైదరాబాద్‌లో కార్యాలయ ఏర్పాటుకు రెడీ!

ABN, First Publish Date - 2022-07-22T00:01:30+05:30

దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కూ (Koo) హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించేందుకు తెలంగాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కూ (Koo) హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. హైదరాబాద్ ఒక ఐటీ హబ్‌గా ఉండటం,  బలమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండటం, ఐటీ ప్రతిభను కలిగి ఉన్న పెద్ద సమూహాన్ని కలిగి ఉండటంతో కూ ఈ ప్రాంతంలో తన ఉనికిని గణనీయమైన రీతిలో అభివృద్ధి చేయాలని భావిస్తోంది. 10 భాషలలో వ్యక్తీకరించడానికి యూజర్లకు అధికారం ఇచ్చే స్వతంత్ర, సమగ్ర వేదిక అయిన కూ  గణనీయమైన కమ్యూనిటీని కలిగి ఉంది.


ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగు వాడకంపై కూతో కలిసి పని చేస్తుంది. తెలంగాణ ప్రత్యేక సంస్కృతితో పాటు, ఒక భాషగా తెలుగు వారసత్వాన్ని కూడా ఇది ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీఈ అండ్ సీ(ITE&C) మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడానికి సోషల్ మీడియా (Social Media) ఒక ముఖ్యమైన యంత్రాంగమని మేము గట్టిగా తాము నమ్ముతున్నట్టు చెప్పారు. కూతో సహకరించడం ద్వారా, తెలంగాణ ప్రభుత్వ సమాచారం, సేవలను వ్యాప్తి చేయడం కోసం పౌరులతో కనెక్ట్ అయ్యే అవకాశాలు విస్తృతమవుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. 


 కూ కో-ఫౌండర్, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ (Aprameya Radhakrishna) మాట్లాడుతూ.. భారతదేశం వంటి వివిధ భాషా దేశంలో భాష ఆధారిత సోషల్ మీడియా ఈ సమయంలో అవసరమన్నారు. తటస్థంగా, స్వతంత్రంగా ఉండడం కోసం కూ అనేది భారతీయులకు ఎంపిక చేసుకునే వేదిక అని పేర్కొన్నారు. డిజిటల్ భావప్రకటనా స్వేచ్ఛతో గొంతులకు సాధికారత కల్పించేందుకు దీనిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం తమకు నిజంగా గొప్ప గౌరవమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని డెవలప్‌మెంట్ సెంటర్ ఈ మిషన్‌లో కీలకంగా ఉంటుందని రాధాకృష్ణ పేర్కొన్నారు.


కాగా, మార్చి 2020లో లాంచ్ అయిన ‘కూ’.. హిందీ, మరాఠి, గుజరాతి, పంజాబి, కన్నడ, తెలుగు, అస్సామి, బెంగాలి, ఇంగ్లిష్ వంటి పది భాషల్లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు 40 మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 

Updated Date - 2022-07-22T00:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising