ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Koo App: కొత్త మేకోవర్‌తో అత్యుత్తమ బ్రౌజింగ్ అనుభవం

ABN, First Publish Date - 2022-04-28T22:49:19+05:30

బహుబాషా మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ ‘కూ’ సరికొత్త హంగులు అద్దుకుంది. ఐవోస్, ఆండ్రాయిడ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బహుబాషా మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ ‘కూ’ సరికొత్త హంగులు అద్దుకుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అత్యుత్తమ బ్రౌజింగ్ ఆప్షన్‌తో ముందుకొచ్చింది. వినియోగదారులు ఈ యాప్‌లో మునిగిపోయేలా చేసేందుకు పలు మార్పులు తీసుకొచ్చింది. డిజైన్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. ఈ సరికొత్త ఇంటర్‌ఫేస్ నేవిగేషన్‌ను మరింత సులభతరం చేస్తుంది. అలాగే, యూజర్లకు అత్యుత్తమ, సమకాలీన అనుభవాన్ని అందిస్తుంది.


ఇప్పటి వరకు ఎడమవైపు కనిపించిన ఖాళీ స్థలాన్ని పూర్తిగా తొలగించింది. ఫలితంగా కంటెంట్ కోసం మరింత స్పేస్ అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల అవసరమైన సమాచారం మరింత ఈజీగా లభించేలా చేసింది. అవసరం లేని సమాచారాన్ని తగ్గించడం వల్ల యాప్ మునుపటి కన్నా మరింత నీట్‌గా కనిపిస్తోంది. సాఫీగా, అంతరాయం లేని బ్రౌజింగ్ కారణంగా యూజర్లు ఈ యాప్‌లో గరిష్ఠ సమయాన్ని గడుపుతారు. 


కూ యాప్ డిజైన్ హెడ్ ప్రియాంక్ శర్మ మాట్లాడుతూ.. యూజర్లకు అపరిమిత ఆనందాన్ని పంచడమే తమ బ్రాండ్ ఫిలాసఫీ అని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా యూజర్ ఇంటర్‌ఫేస్ మంచి అనుభవాన్ని ఇస్తుందన్నారు. యాప్‌లో లీనమయ్యే బ్రౌజింగ్ అనుభవాన్ని పరిచయం చేయడం ప్రపంచంలోనే అత్యుత్తమ బహుభాషా మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ నిర్మాణానికి తొలి అడుగు అని అన్నారు. కాగా, దేశంలోని స్థానిక భాషల్లో స్వీయ వ్యక్తీకరణకు కూ అతిపెద్ద వేదికగా మారింది.  ప్రస్తుతం  హిందీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, తమిళం, బెంగాలీ, అస్సామీ, తెలుగు, పంజాబీ, ఇంగ్లిషులలో అందుబాటులో ఉంది. అలాగే, ఇటీవల డార్క్ మోడ్, టాక్-టు-టైప్, చాట్ రూమ్‌లు, లైవ్ వంటి కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కూ తీసుకొచ్చింది.


Updated Date - 2022-04-28T22:49:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising