ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాసిక్‌లో కిమ్స్‌ హాస్పిటల్‌ 325 పడకలతో అభివృద్ధి

ABN, First Publish Date - 2022-05-15T07:53:14+05:30

కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) మహారాష్ట్రలోని నాసిక్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసుపత్రిలో 51% వాటా

మహారాష్ట్రలోకి అడుగు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) మహారాష్ట్రలోని నాసిక్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ప్రముఖ అంకాలజీ సర్జన్‌ రాజ్‌  నాగర్కర్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. కిమ్స్‌ మానవత హాస్పిటల్‌ పేరుతో ఏర్పాటు చేసే ఈ ఆసుపత్రిలో 51 శాతం వాటా కిమ్స్‌కు, 49 శాతం వాటా రాజ్‌ నాగర్కర్‌కు ఉంటుందని కిమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ రావు తెలిపారు. 325 పడకలతో ఏర్పాటు చేసే ఈ కొత్త ఆసుపత్రి 2024 మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే వీలుంది. నాసిక్‌లో కొత్త హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మహారాష్ట్రలోకి అడుగు పెడుతున్నాం. సర్జికల్‌ అంకాలజీలో అగ్రగామిగా ఉన్న నాగర్కర్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉందని భాస్కర్‌ రావు చెప్పారు. పెట్టుబడులు త్వరలో వెల్లడిస్తామన్నారు. నాగర్కర్‌ 45 వేలకు పైగా క్యాన్సర్‌ సర్జరీలు చేశారు. 275 పడకల సమగ్ర క్యాన్సర్‌ కేంద్రం హెచ్‌సీజీ మానవత కేన్సర్‌ సెంటర్‌కు అధిపతిగా ఉన్నారు. 

Updated Date - 2022-05-15T07:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising