అమ్మకానికి కేజీ బేసిన్ గ్యాస్
ABN, First Publish Date - 2022-12-31T03:18:37+05:30
కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ6 క్షేత్రంలో ఉత్పత్తి చేసే గ్యాస్ అమ్మకానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి బిడ్స్ ఆహ్వానించింది.
బిడ్స్ ఆహ్వానించిన రిలయన్స్
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ6 క్షేత్రంలో ఉత్పత్తి చేసే గ్యాస్ అమ్మకానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి బిడ్స్ ఆహ్వానించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ క్షేత్రం నుంచి రోజుకు 60 లక్షల ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ సరఫరా చేస్తామని తెలిపింది. ఈ గ్యాస్ కొనేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు 2023 ఫిబ్రవరి నుంచి జపాన్, కొరియా దేశాలు దిగుమతి చేసుకునే ధర ఆధారంగా బిడ్స్ దాఖలు చేయాలని కోరింది. ప్రస్తుతం ఈ రెండు దేశాలు ఒక్కో ఎంఎంబీటీయూ గ్యాస్‌ను 28.83 డాలర్ల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ ధరపై 5.01 డాలర్ల కంటే తక్కువగాకుండా బిడ్స్ వేయాలని రిలయన్స్ కోరింది.
Updated Date - 2022-12-31T03:18:38+05:30 IST