ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్ళీ చేరండి... మాజీ క్యాబిన్ సిబ్బందికి ‘జెట్’ ఆహ్వానం

ABN, First Publish Date - 2022-06-25T02:33:41+05:30

జెట్ ఎయిర్‌వేస్ కార్యాచరణ నియామకాలను ప్రారంభించింది, మాజీ క్యాబిన్ సిబ్బందిని ‘మళ్లీ చేరండి’ అంటూ ఆహ్వానిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జెట్ ఎయిర్‌వేస్ కార్యాచరణ నియామకాలను ప్రారంభించింది, మాజీ క్యాబిన్ సిబ్బందిని ‘మళ్లీ చేరండి’ అంటూ ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించి... తన కార్యాచరణ నియామకాలను శుక్రవారం ప్రారంభించడంతోపాటు తన మాజీ క్యాబిన్ సిబ్బందిని... తిరిగి ఎయిర్‌లైన్‌లో చేరాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కాగా... జెట్ ఎయిర్‌వేస్... శ్రీలంక ఎయిర్‌లైన్స్ మాజీ సీఈఓ విపుల గుణతిలకను CFOగా నియమించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు... 'అకౌంటబుల్ మేనేజర్'గా ప్రియాపాల్ సింగ్‌ను నియమించింది.


కాగా... NCLT జెట్ ఎయిర్‌వేస్ పునరుద్ధరణ ప్రణాళిక గడువును మార్చి 29 వరకు పొడిగించింది. ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA మే 20న జెట్ ఎయిర్‌వేస్‌కు రీవాలిడేటెడ్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (AOC) మంజూరు చేసిన విషయం తెలిసిందే, ఇది విమానయాన సంస్థ వాణిజ్య విమాన కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు వీలు కల్పిస్తుంది. మాజీ జెట్ సిబ్బందికి పిలుపుతో తమ కార్యాచరణ నియామకం ప్రారంభమైందని ఎయిర్‌లైన్ సీఈఓ సంజీవ్ కపూర్ ట్విట్టర్‌లో తెలిపారు. రానున్న రోజుల్లో పైలట్‌లు, ఇంజనీర్ల నియామకం ప్రారంభం కానున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. ఇక జులై-సెప్టెంబరు త్రైమాసికంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను పునఃప్రారంభించాలని జెట్  ఎయిర్‌లైన్ భావిస్తోంది.

Updated Date - 2022-06-25T02:33:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising