ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ITC Hotels: తమ బ్రాండ్‌స్టోరీకి మరో ఐదు ప్రాపర్టీలను జోడించిన ఐటీసీ హోటల్స్

ABN, First Publish Date - 2022-09-23T00:36:48+05:30

ఐటీసీ హోటల్స్ (ITC Hotels) గ్రోత్ స్టోరీ కొనసాగుతోంది. ఈ గ్రూప్ తమ నూతన బ్రాండ్ స్టోరీ (Storii)కి మరో ఐదు బొటిక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఐటీసీ హోటల్స్ (ITC Hotels) గ్రోత్ స్టోరీ కొనసాగుతోంది. ఈ గ్రూప్ తమ నూతన బ్రాండ్ స్టోరీ (Storii)కి మరో ఐదు బొటిక్ ప్రాపర్టీ (boutique properties)లను జోడించింది. స్టోరీ బై ఐటీసీ హోటల్స్ (Storii by ITC Hotels) కింద వీటిని తెరిచేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. లీజర్ డెస్టినేషన్లు అయిన గోవా, ధర్మశాల, సోలన్, సిమోర్, కుఫ్రీలలో ఈ స్టోరీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కాగా, స్టోరీ గోవా, స్టోరీ ధర్మశాలలో ఇప్పటికే అతిథుల రాక ప్రారంభమైంది. స్టోరీ బ్రాండ్‌తో ఐటీసీ హోటల్స్‌ ఇప్పుడు అద్వితీయమైన అనుభవాలను హోటల్స్‌, రిసార్ట్స్‌ ద్వారా అందిస్తున్నాయి. ఇవి క్యారెక్టర్‌, డిజైన్‌ పరంగా భిన్నంగా ఉంటాయి. ఈ బ్రాండ్‌ కింద ఉన్న ప్రతి హోటల్‌ తమదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది.


ఈ సందర్భంగా ఐటీసీ హోటల్స్ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ చద్దా మాట్లాడుతూ.. గత రెండేళ్ల నుంచి దేశంలో లీజర్ ట్రావెల్‌ (Leisure travel) విపరీతంగా పెరిగిందన్నారు. కరోనా మహమ్మారి తర్వాతి తర్వాతి కాలంలో దేశీయ పర్యాటకులు మళ్లీ పర్యాటక రంగంపై మక్కువ పెంచుకుంటున్నారని, తాము ఇంకా ఏం చూడవచ్చన్నది కూడా తెలుసుకుంటున్నారని అన్నారు. ఈ మారుతున్న ధోరణులను పరిశీలించడంతో పాటుగా బొటిక్‌, అనుభవపూర్వక  ఆఫరింగ్‌కు ఉన్న డిమాండ్‌ను గుర్తించినట్టు చెప్పారు. స్టోరీ బై ఐటీసీ హోటల్స్‌ ఈ విభాగానికి అవసరమైన సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. 


ఇటీవల గోవాలో తెరిచిన  స్టోరీ బై ఐటీసీ హోటల్స్‌ విభిన్నమైన స్టోరీలను చెబుతుంది. శతాబ్దాల నాటి గోడలు, పోర్చుగ్రీస్‌, భారతీయ సంస్కృతుల సమ్మేళనంగా ఇది ఉంటుంది. 1897లో నిర్మించబడిన ఈ ‘కాసా డీ మోరాడా’(Casa de Morada) మరిన్ని కథలను వినిపించడానికి సిద్ధంగా ఉంది. అలాగే, ధర్మశాలలో తెరిచిన స్టోరీ బై  ఐటీసీ హోటల్‌ సైతం ఆకర్షణీయమైన గదులు, అద్భుతమైన వీక్షణను అందిస్తూ అతిథులను సాదరంగా ఆహ్వానిస్తోంది.

Updated Date - 2022-09-23T00:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising