ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గని ITC జోరు.. 47 నెలల గరిష్టానికి స్టాక్..

ABN, First Publish Date - 2022-08-22T17:44:56+05:30

డైవర్సిఫైడ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీ ఐటీసీ(ITC) షేర్లు జోరును కొనసాగిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ITC Shares : డైవర్సిఫైడ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీ ఐటీసీ(ITC) షేర్లు జోరును కొనసాగిస్తున్నాయి. బలహీనమైన మార్కెట్‌లో సోమవారం ఇంట్రా-డే(Intra-Day)లో 1.5 శాతం పెరిగి... తాజాగా 47 నెలల గరిష్ట స్థాయి రూ.316.95ని తాకింది. ఈ స్టాక్ సెప్టెంబర్ 3, 2018 నుంచి అత్యధిక స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఐటీసీ జూలై 3, 2017న రికార్డు స్థాయిలో రూ.353కి చేరింది.


గత వారం ఐటీసీ 3 శాతం లాభపడి మార్కెట్‌తో పోలిస్తే అవుట్ పెర్ఫార్మ్ చేసింది. బెంచ్‌మార్క్ సెన్సెక్స్‌(Benchmark Sensex)లో దాదాపు 1 శాతం క్షీణించింది. అంతేకాకుండా గడిచిన ఒక నెలలో ఇది మార్కెట్‌కు అనుగుణంగా 5 శాతం లాభపడింది. ఉదయం 10:34 గంటలకు ఐటీసీ 1.3 శాతం పెరిగి రూ.316.25 వద్ద ట్రేడవుతోంది. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ ఊహించిన దానికంటే గణనీయమైన అమ్మకాలను సాగించింది. కంపెనీ ఏకీకృత నికర లాభంలో వార్షికంగా 38 శాతం వృద్ధిని నమోదు చేసింది. నికర విక్రయాలు వార్షికంగా 41 శాతం పెరిగి, అంచనాలకు మించి రూ.18,164 కోట్లకు చేరుకున్నాయి. ఆపరేటింగ్ మార్జిన్లు 30.8 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. 


Updated Date - 2022-08-22T17:44:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising