ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Festive Sale: ఫెస్టివల్ సేల్స్‌లో వస్తువులు కొంటున్నారా?.. అయితే ఈ టిప్స్ తప్పక తెలుసుకోండి

ABN, First Publish Date - 2022-09-26T03:12:09+05:30

ఈ-కామర్స్ వెబ్‌సైట్లు (E-commerce), ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు ఇప్పటికే ఫెస్టివల్ సేల్స్‌ షురూ చేశాయి. వచ్చే నెలలో దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని ఈ సేల్స్‌లో కస్టమర్లకు ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ-కామర్స్ వెబ్‌సైట్లు (E-commerce), ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు ఇప్పటికే ఫెస్టివల్ సేల్స్‌ షురూ చేశాయి. వచ్చే నెలలో దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని ఈ సేల్స్‌లో కస్టమర్లకు ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్, మింత్రాతోపాటు ఇతర సంస్థలు ఆకర్షణీయ డీల్స్, క్యాష్ బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కొనుగోలు చేసే ముందు వినియోగదారులు పరిగణలోకి తీసుకోవాల్సిన పలు అంశాలున్నాయి. అవేంటో మీరు కూడా తెలుసుకోండి.


వస్తువుని కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించి రివ్యూలను చెక్ చేసుకోవాలి. తద్వారా ఆ ప్రొడక్ట్ పనితీరుపై మీకో అభిప్రాయం కలుగుతుంది. ఇక ధరల విషయానికి వస్తే.. బయట స్టోర్ల(Physical stores)లో ధరలను ఆన్‌‌లైన్ ధరలతో పోల్చిచూసుకోవడం మంచిది. బీఎన్‌పీఎల్(బై నౌ.. పే లేటర్), ఈఎంఐ కాస్ట్ లేని ఆఫర్ల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. లేదంటే మీరు డెట్(debt) ట్రాప్‌లో పడే అవకాశాలుంటాయి. ఇక అన్నింటి కంటే ముఖ్యంగా తక్కువ రేటుకే దొరుకుతున్నాయి కదా అని వస్తువులు కొనుగోలు చేయడం ఉపయోగకరం కాదు. అవసరమైన వస్తువుని మాత్రమే కొనుగోలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు ల్యాప్‌ట్యాబ్‌ని తీసుకుంటే.. ప్రస్తుతం వాడుతున్నదానిని అప్‌గ్రేడ్ చేసుకునే వీలుంటే చేసుకుని వాడండి. అప్‌‌గ్రేడ్ చేయించుకున్నా మీ ల్యాప్‌ట్యాబ్ పనితీరు మెరుగయ్యే అవకాశాలుంటాయి. కానీ తక్కువకే వస్తుందనే ఆలోచనతో కొత్తది కొనుగోలు చేస్తే ఆర్థికంగా మీపై ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితికి కంపెనీ ఆఫర్లు, డిస్కౌంట్ల నోటిఫికేషన్లే కారణమవుతున్నాయి. కాబట్టి వేర్వేరు ఆన్‌లైన్ సేల్స్ కంపెనీల యాప్స్ పుష్ నోటిఫికేషన్స్ ఆపివేయడం ఉత్తమమో పరిశీలించండి.

Updated Date - 2022-09-26T03:12:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising