ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IT కంపెనీలు... work from home కొనసాగింపు

ABN, First Publish Date - 2022-07-04T02:38:31+05:30

కరోనా నేపథ్యంలో... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), ఇన్ఫోసిస్ తమ హైబ్రిడ్ మోడల్ పనిని కొనసాగిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), ఇన్ఫోసిస్ తమ హైబ్రిడ్ మోడల్ పనిని కొనసాగిస్తున్నాయి. ఇతర ఐటీ కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇటీవల తమ కార్యాలయాలను తెరచిన విషయం తెలిసిందే. ఉద్యోగులను తప్పనిసరిగా కార్యాలయాలకు తిరిగి రావాలంటూ ఆదేశించాయి. కాగా... పెరుగుతున్న COVID-19 కేసులు మళ్లీ ‘work from home’ను కొనసాగించవలసి వచ్చింది.


ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం... భారత్‌లో ఒకే రోజు 16,103 కరోనావైరస్ కేసులు, 31 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో... కేసుల సంఖ్య 4,35,02,429కి, మరణాల సంఖ్య 5,25,199కి చేరుకున్నాయి. US-ఆధారిత IT కంపెనీ Synopsys యొక్క నోయిడా యూనిట్ సిబ్బందిలో COVID-19 కేసు వెలుగుచూసిన తర్వాత work from homeను  తిరిగి ప్రారంభించింది. 


ఇక Paytm కూడా తన ఉద్యోగులను ఇంటి నుండి పనిని కొనసాగించడానికి అనుమతించింది. ఇక... దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలలో, టీసీఎస్, ఇన్ఫోసిస్ దీర్ఘకాలికంగా పనిచేసే హైబ్రిడ్ మోడల్‌ను కొనసాగించాలన్న తమ నిర్ణయాన్ని  ఇప్పటికే తెలియజేశాయి. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లలో 5 శాతం మాత్రమే ఇప్పుడు కార్యాలయానికి వెళ్తున్నారు, వీరు ప్రధానంగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు.


TCS కూడా ఈ మాదిరిగానే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది, అప్పుడప్పుడు ఆపరేటింగ్ జోన్‌లు, హాట్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తామని, అంతేకాకుండా... 25×25 విధానాన్ని అవలంభిస్తామని ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం... కంపెనీ అసోసియేట్‌లలో 25 శాతానికి మించి ఏ సమయంలోనైనా కార్యాలయం నుండి పని చేయాల్సిన అవసరముండబోదు. అంతేకాకుండా... వారు తమ సమయాన్ని 25 శాతానికి మించి ఆఫీసులో గడపాల్సిన అవసరముండదు. ఇన్ఫోసిస్ కూడా హైబ్రిడ్ మోడల్ వర్క్ కోసం తన దీర్ఘకాలిక ప్రణాళికను ప్రకటించింది. ఇక... HCL టెక్నాలజీస్ కంపెనీ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి... ఉద్యోగులు,  వారి కుటుంబాల భద్రత మరియు శ్రేయస్సు. ఈ క్రమంలోనే... కంపెనీ తన వ్యాపారాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి కట్టుబడి ఉందని, తద్వారా తన క్లయింట్‌లకు నిరంతరాయమైన సేవలను అందజేస్తుందని, కంపెనీ హైబ్రిడ్ మోడల్‌లో పనిచేస్తుందని పేర్కొంది.

Updated Date - 2022-07-04T02:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising