ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్డీ రేట్లు మరింత పైపైకి

ABN, First Publish Date - 2022-09-23T07:24:07+05:30

అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతోంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ (బీఓఈ) కూడా అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బాటలో నడుస్తోంది. బీఓఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫెడ్‌ బాటలోనే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌


లండన్‌: అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతోంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ (బీఓఈ) కూడా అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బాటలో నడుస్తోంది. బీఓఈ గురువారం తన కనీస వడ్డీ రేటును మరో అర శాతం పెంచింది. దీంతో బ్రిటన్‌లో కనీస వడ్డీ రేటు ఇప్పుడు 2.25 శాతానికి చేరింది. నెల తిరక్కుండానే బీఓఈ కీలక వడ్డీ రేటు ని మరో అర శాతం పెంచడం విశేషం. ధరల సెగకు కళ్లెం వేసేందుకు ఇంతకంటే మరో మార్గం లేదని పేర్కొంది. 


అదే బాటలో స్విట్జర్లాండ్‌: స్విట్జర్లాండ్‌ కూడా ధరల సెగతో అల్లాడిపోతోంది. దీన్ని కట్టడి చేసేందుకు స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంక్‌ ‘ది స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎన్‌బీ) కీలక వడ్డీ రేట్లను ఒక్కసారిగా ముప్పావు (0.75) శాతం పెంచిం ది. దీంతో స్విట్జర్లాండ్‌లో కనీస వడ్డీ రేటు మైనస్‌ 0.25 శాతం నుంచి ప్లస్‌ అర శాతానికి చేరాయి.


టర్కీలో తగ్గిన వడ్డీ రేట్లు: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నా యి. టర్కీ కేంద్ర బ్యాంక్‌ మాత్రం అందుకు వ్యతిరేక చర్య తీసుకుంది. కనీస వడ్డీ రేటుని 13 శాతం నుంచి 12 శాతానికి కుదించింది.  

Updated Date - 2022-09-23T07:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising