ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి రాజీనామా

ABN, First Publish Date - 2022-01-02T05:59:50+05:30

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి తన పదవికి రాజీనామా చేశారు. 2021 డిసెంబరు చివరిలో తన పదవిని వీడుతానని ప్రకటించిన ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తదుపరి జీవితం సమాజ సేవకేనని వెల్లడి 

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి తన పదవికి రాజీనామా చేశారు. 2021 డిసెంబరు చివరిలో తన పదవిని వీడుతానని ప్రకటించిన  ఆమె, అన్న ప్రకారం రిజైన్‌ చేశారు. తదుపరి జీవితమంతా సమాజసేవకే అంకితం చేస్తానని ప్రకటించారు. 1996లో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ప్రారంభం కాగా అప్పటి నుంచి సుధామూర్తి చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గావిలో జన్మించారు. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఎంటెక్‌ చేశారు. దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభించినప్పుడు నష్టపోయిన వారికి 2,300 ఇళ్లు, 16 వేల శౌచాలయాలను ఫౌండేషన్‌ తరఫున నిర్మించారు. తమిళనాడు, అండమాన్‌లో సునామీ, కచ్‌లో భూకంపం, ఒడిశా, ఏపీలో వరదలు తలెత్తినప్పుడు రూ.కోట్ల విలువైన నిత్యావసరాలను సమకూర్చారు. కొవిడ్‌ రెండు దశలో లక్షల మందికి నిత్యావసర కిట్లు, ఔషధాలు సమకూర్చారు. బెంగళూరులోని కేన్సర్‌ ఆసుపత్రి కిద్వాయ్‌, గుండె జబ్బులకు చికిత్సలు అందించే జయదేవ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయించారు.  రెండు పర్యాయాలు టీటీడీ బోర్డు సభ్యురాలిగా వ్యవహరించారు. 

Updated Date - 2022-01-02T05:59:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising