ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SOVA Android Trojan: కొత్త మాల్‌వేర్ ‘సోవా’ కలకలం.. కస్టమర్లకు బ్యాంకుల హైఅలెర్ట్.. 200 యాప్స్ టార్గెట్

ABN, First Publish Date - 2022-09-22T01:47:44+05:30

యాప్‌లు(apps) డౌన్‌లోడింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అధికారిక యాప్ స్టోర్ల(app stores) నుంచి మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలని భారతీయ బ్యాంకులు(Indian banks) తమ కస్టమర్లను హెచ్చరించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : యాప్‌లు(apps) డౌన్‌లోడ్ చేసుకునే విషయంలో జాగ్రత్త వహించాలని, అధికారిక యాప్ స్టోర్ల(app stores) నుంచి మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలని భారతీయ బ్యాంకులు(Indian banks) తమ కస్టమర్లను హెచ్చరించాయి. ట్రొజన్ వైరస్ (Trojan virus) కొత్త వెర్షన్ ‘సోవా’(SOWA) మాల్‌వేర్ మొబైల్ బ్యాంకింగ్(Mobile banking), క్రిప్టో(cryptos)కు సంబంధించిన 200 లకుపైగా యాప్స్‌ను టార్గెట్ చేస్తోందని బ్యాంకులు అప్రమత్తం చేశాయి. ఈ మాల్‌వేర్ బ్యాంక్ కస్టమర్ల  లాగిన్ వివరాలు, కుకీస్‌ను దొంగిలించి మోసగాళ్లకు చేరవేస్తాయని వివరించాయి. ఈ వైరస్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తుందని కేంద్రప్రభుత్వ విభాగం సీఈఆర్‌టీ-ఇన్ (Indian Computer Emergency Response Team) ఇటివలే అడ్వైజరీ విడుదల చేసింది. సోవా ఆండ్రాయిడ్ ట్రొజన్‌ వైరస్‌పై జాగ్రత్తగా ఉండాలంటూ యాప్స్ డౌన్‌లోడ్స్‌పై హెచ్చరించింది. ఈ వైరస్ మొబైల్ బ్యాంకింగ్ వివరాలను దోచేసి మోసగాళ్ల చేతికి చేరవేస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారతీయ బ్యాంకులు తమతమ కస్టమర్లను అప్రమత్తం చేశాయి. కస్టమర్లను హెచ్చరించిన బ్యాంకుల జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, కరూర్ వైశ్యా బ్యాంక్‌తోపాటు పలు బ్యాంకులు ఉన్నాయి.  


ఏంటీ సోవా ?

సోవా అనేది ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రొజన్ మాల్‌వేర్. ఇది బ్యాంకింగ్ యాప్స్‌ను టార్గెట్ చేస్తుంది. ఈ మాల్‌‌వేర్ బ్యాంకింగ్ యాప్స్‌పై నకిలీ పొరలను (false layers) ఏర్పాటు చేస్తుంది. ఆ పొరల సహాయంతో పేమెంట్‌తోపాటు యాప్ వివరాలను చోరికి గురవుతాయి. ఈ వైరస్‌ను సెప్టెంబర్ 2021లో అండర్‌గ్రౌండ్ మార్కెట్లలో విక్రయించారు. యూజర్ పేర్లు, పాస్‌వర్డులను కూడా దొంగిలించగలదని సీఈఆర్‌టీ-ఇన్ తెలిపింది. ఈ వైరస్ తొలుత అమెరికా, రష్యా, స్పెయిన్‌పై మాత్రమే ఫోకస్ చేసింది. అయితే జులై 2022 నాటికి భారత్ సహా పలు దేశాల్లోనూ గుర్తించారు.

Updated Date - 2022-09-22T01:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising