ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ రాయితీలతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయనున్న భారత్!

ABN, First Publish Date - 2022-03-15T01:55:42+05:30

ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేపథ్యంలో కఠిన ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా చేసిన ఆఫర్‌ను భారత్ పరిశీలిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేపథ్యంలో కఠిన ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా చేసిన ఆఫర్‌ను భారత్ పరిశీలిస్తోంది. రూపాయి-రూబుల్ లావాదేవీ ద్వారా తమ ముడిచమురును, వస్తువులను భారీ రాయితీలతో కొనుక్కోవచ్చంటూ భారత్‌కు రష్యా ఆఫర్ చేసింది. ఇప్పుడీ ఆఫర్‌ను భారత్ పరిశీలిస్తున్నట్టు అధికారుల ద్వారా తెలిసింది.


80 శాతం దిగుమతుల ద్వారా భారత్ తన చమురు అవసరాలను తీర్చుకుంటోంది. ఇందులో రెండు నుంచి మూడు శాతం రష్యా నుంచి దిగుమతి అవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే ఇంధన ధరలు 40 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న చమురు బిల్లులను తగ్గించుకోవాలని చూస్తున్న భారత్.. ధరలను తగ్గించగలిగితే రష్యా నుంచి దిగుమతులను పెంచుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఆఫర్ భారత్‌ను ఊరిస్తోంది.


‘‘చమురు, ఇతర వస్తువులను భారీ రాయితీలపై అందిస్తామని రష్యా ముందుకొచ్చింది. ఈ ఆఫర్‌పై ఆనందంగా ఉంది. అయితే, ట్యాంకర్, బీమా కవరేజీ, ఆయిల్ బ్లెండ్స్ వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. అవి పరిష్కారమయ్యాక ఈ రాయితీ ఆఫర్‌ను వినియోగించుకుంటాం’’ అని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. 

Updated Date - 2022-03-15T01:55:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising