ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబై ఓటములకు పూర్తి బాధ్యత నాదే

ABN, First Publish Date - 2022-04-17T03:31:46+05:30

ముంబై : ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అపజయాల పరంపర కొనసాగుతోంది. లక్నో సూజర్ జెయింట్స్‌పై పోరులో వరుసగా ఆరవ మ్యాచ్‌లోనూ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అపజయాల పరంపర కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై పోరులో వరుసగా ఆరవ మ్యాచ్‌లోనూ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. లక్నో సూపర్ జెయింట్స్‌ 18 పరుగుల తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ప్రజెంటేషన్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములకు పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించాడు. ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకునేందుకు ఎలాంటి మార్పులు అవసరమో అన్వేషిస్తామని తెలిపాడు. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలిస్తే సరిదిద్దేవాడిని. కానీ తెలియడం లేదు. ఎప్పటిలాగానే ప్రతి మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాను. కానీ విఫలమవుతున్నాం. లోపం ఏంటో తెలియడం లేదని అన్నాడు.  టీం సభ్యుల అంచనాలకు అనుగుణంగా జట్టును ముందుకు నడిపించలేకపోతున్నందుకు బాధ్యత తీసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా చేస్తున్నదే ఈ ఏడాదీ చేస్తున్నాను. లోపం ఎక్కడుందో అర్థంకావడం లేదని విచారం వ్యక్తం చేశాడు. సానుకూల దృక్పథంలో ఉండడం ఉత్తమం. ఎందుకంటే ప్రపంచమేమీ అంతమవ్వడం లేదు. ఖచ్చితంగా తిరిగిపుంజుకుంటాం. ఇందుకోసం ప్రయత్నిస్తాం అని రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీంతోపాటు వ్యక్తిగతంగా రోహిత్ కూడా ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు కేవలం 114 పరుగులు మాత్రమే చేయడం రోహిత్ శర్మ ఫామ్‌లేమిని తెలియజేస్తోంది.

Updated Date - 2022-04-17T03:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising